పుట:Naayakuraalu.Play.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

111

[ ఉభయులూ బయలు దేరారు ]

అ. రా : నేను వచ్చిన విషయం తమతో మనవిచేస్తాను, దయచేసి సావకాశంగా వినండి.

నర : అవశ్యం. అ. రా : మావాండ్లు యేడేండ్లు అష్టకష్టాలు పడి సమయం నెరవేర్చి వచ్చారు.

నర : మనవాండ్లని అనండి. నేనుమట్టుకు వాండ్లనుగురించి మనసులో విచారించడం లేదనుకున్నారా? మన వాండ్లు వస్తున్నారని తెలిసే అహోరాత్రులు కర్తవ్యమే విచారిస్తున్నా,

అ. రా : చిత్తం. కుటుంబకలహం జరుగకుండా వ్యవహారం సర్దే ఉపాయ మేదో తమరే యోచించండి.

నర : నేను అరవిడిచి మీతో చెపుతాను. అటు అన్నా, ఇటు తమ్ములూను. ఎవరికి ఆపద వచ్చినా నాకు వచ్చినట్టే. అన్నగారు ఒక మాటమీద నిలువరు. సలహాదారులు ఒకరుగారు. ఆయనకు ఏది నచ్చితే ఆ ప్రకారం బోతారు. ఒక్కొక్కప్పుడు ఇతరు లెన్నిచెప్పినా తన కెంతతోస్తే అంత. ఇతరు లెంతజెప్పినా ససేమిరా అంటారు.

అ. రా : అవును. ఆ మాట నిజమేకాని తమమాట తీసి వెయ్యలేరు. తమరు గట్టిగా పట్టుపడితే కుటుంబకలహం ఆపివేయగలరని నా నమ్మకం.

నర : సంధికావడం నాకు మిక్కిలి సంతోషం. నాకంటె మీయందు వారికి మక్కువెక్కువ. మీరు గట్టిపట్టు పట్టండి ; కాకెక్కడికి బోతుందో చూతాము.