పుట:Naayakuraalu.Play.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

101

మ. దే. రా : నిన్నుగురించి చెప్పుకొనడానికి సందేహిస్తున్నావు గామాలె ; మరొకవిధంగా తెలిసికొనడానికి ప్రస్తుతం మా కవకాశంలేదు. కనుక ఆత్మస్తుతి దోషమని యెంచక జరిగినదంతా వివరముగా మరొకడు జెప్పినట్టు నీవే చెప్పుమని ఆజ్ఞాపించుతున్నాను.

క. దా : చిత్తము. నేను కత్తి చేతికి తీసుకొని చెదిరినగోపాల బలమంతా కూడదీసుకొని, హతశేషులయిన చెంచులనందరినీ తుదముట్టించి, మందలను మళ్లవేసి, మనవూరి గమిటి దగ్గర నిలువవేశాము.

బ్రహ్మ: పల్నాటివీరున కర్హమయినరీతినే వర్తించావు. ఇక మీ కార్యమును నిర్ణయించుకోండి.

బా. చం : బాలుడనే కారణంచేత నా అభిప్రాయం యిదివరకొక పర్యాయము త్రోసిపుచ్చారు. మళ్లీ అవకాశం వచ్చిందిగనుక తిరిగి విన్నవించుతాను. మీ సేవకులలో మేటి వీరు డొకడు మ్రుక్కడి చెంచులచేతిలో బడి మరణించాడు. ఇటులనే గడువుదినాలలోపల తక్కినవారుకూడ గోవులకని, గొఱ్ఱెలకని ప్రాణా లర్పించడం జరుగబోతుంది. అట్టి దుర్మరణము మాకందరికీ సంభవించకముందే మన నీ యిక్కట్టులపాలుజేసిన నాయకురాలినీ, దాని మ్రుక్కడి అనుచరులనూ అంత మొందించడమో, లేక పల్నాటికై ప్రాణాలర్పించడమో మేము చేయగలముగాని వీరధర్మమెరుగని యే యేనాదులచేతులలోనో చావలేము.

క. దా : రాజ్యములు వీరు లనుభవించతగినవిగాని విరాగు లనుభవించదగినవిగావు. గొడ్లకూ, గోదలకూ ప్రాణమ