పుట:Naayakuraalu.Play.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

నాయకురాలు

చెంచు వెనుకపొంచుండి కోల్పులివలె దుమికి గురిజాలక త్తితో లంకన్న కుడిభుజమును నరికివైచాడు.

మ. దే. రా : లంకన్న కుడిభుజముతో మన కుడిభుజమూ పడిపోయింది.

బ్రహ్మ : నాగమ్మబంపిన ఖడ్గమే మృత్యువునకు తోడ్పడినదా ?

క. దా : నేలపడినభుజము భుజంగమువలె శత్రువును వెదకినట్టు నలువంకకూ బారినది.

బ్రహ్మ : శౌర్యము అతని యెముకలకుబట్టి వొంట జితించింది.

క. దా : అంతట సవ్యసాచియై యెడమచేతితో యీటెగొని అందిన చెంచునల్లా యేటు కొక్కనిగా పొడిచివేశాడు. తక్కిన యెరుకలెల్లరూ ఆ భీకరమూర్తినిచూచి నివ్వెరపడి పారిపోవడమునకూ, పోరాడడమునకూ కాలుచేతులాడక కత్తుల నేలవైచి, కట్టెలై నిలువబడ్డారు. నిరసరాధులపై కురుకుట కిచ్చగింపకనో యన్నట్లు బలమయిన గాయముచేత రక్తము క్షీణించి మన దుర్దశకు నిట్టూర్పువిడిచి నేలకొరిగాడు. ఇది హతశేషులవలన నే విన్న చరిత్ర.

మ. దే. రా : తమ నాయకుని గోల్పోయిన గోవులనూ, గోపాలురనూ వెంటనే శత్రువులు వశము జేసిసికొన్నారు కాబోలు. తరువాతి కష్టచరితమునుగూడ వినుటకు సిద్ధముగనే వున్నాము. దాసూ, త్వరలో ముగించు.

క. దా : త్వరలోనే ముగిస్తాను. కష్టకాలమల్పమయినా ధీర్ఘముగనే కనబడుతుంది. గోపాలుర ఆర్తధ్వనులు విని చేరువలోవున్న యీ మీ దాసుడు..... ( భిడియపడతాడు. )