పుట:Naatyakala maasapatrika, sanputi 1, sanchika 2, april 1935.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్థ

ఆంధ్ర నాటకకళా పరిషత్తు

అధ్యక్షుల ప్రసంగము

చాలకాలమునుండియు నాట్యకళాపరిషత్తు నొకదానిని నెలకొల్పు జతనములు మన యాంధ్రదేశమునందు జరిగినట్లు తెలియుచున్నది. భారతీతీర్థ వర్ధంత్యుత్సవములలో నాటకకళను కూర్చి కొన్నికొన్ని సమావేశములు జరిగినవి. 1924-వ సంవత్సరమున బ్రహ్మశ్రీ తిరుపతి కవుల యాజమాన్యము క్రింద నొకసభ జరిగినది. తరువాత 1927-వ సంవత్సరమున నెల్లూరు నాగరాజరావుగారి యాజమాన్యము క్రింద మరియొకటి జరిగినది. ఏదో విధమున నీబీజము కొంత యాందోళనతో నాటబడినదని చెప్పవచ్చును. వర్షములు లేక నీరములు కొరతపడి యది వృద్ధిజెందక గుజ్జువారెను. 1929-వ సంవత్సరమున నిజరూపముతో నిట్టి పరిషత్తు తెనాలి పురమున జరిగెను. ఈ పావనాంకురము కృషిచేసి నీరములబోసి కార్యరూపమున జయప్రదముగ కొనసాగించినది సురభి నాట్యమండలివారు.