Jump to content

పుట:Naatyakala maasapatrika, sanputi 1, sanchika 2, april 1935.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

122 నాట్యకళ


దీనితర్వాతి నాటకము “యువజన సమితి” (The League of Youth, 18699. ఇందు సంఘ ముయొక్క దుర్ణయములను, ముఖ్యముగా రాజకీయములైన వానిని ఇబ్్సన్ నిరసించినాడు. స్టెక్ నుగార్డు ఒక రాజకీయప్రవక్త. ఉడుకెత్తించు ఉపన్యాసములతో ప్రజల ఆదరామోద ములను బడసి, సమయానుసారముగా నొక రాజకీయకక్షునుండి మఱోకకక్షకు చెంగు చెంగున దాటు స్వభావము గలవాడు. ఇతనికి ఉన్నతాదర్శములు లేవు; ఉదార భావసంపత్తి పూజ్యము. మాట ప్రజాక్షేమము పై; మనను స్వలాభముమీద.

ఈకడపటి రెండు నాటకములందలి పోకడలు తర్వాతి నాటకమగు “సంఘ స్తంభములు” (Pillars of society, 1887) బాగుగా వ్యక్తపరచినది. ఇంతవఱకు ఇబ్సన్ చించిన నాటకము లతని నాటక రచనాభ్యాసకాలమునకు జెందినవి. అవన్నియు పద్యరూపములుగా రచింపబడినవి. కాని యీనాటకము మొదలుకొని తక్కినవన్నియు ముందు వాటికి భిన్నములై నూత్న మార్గమును త్రొక్కినవి. ఆదర్శమునం దేమి, రచనా పద్ధతియందేమి వానియం దోక ఐక్యము కాననగుచున్నది. అన్నియును పచనమున రచితములు. సామాన్యముగా నన్నియును ఒకటి రెండుగంటలలో బ్రదర్శింపదగినంత చిన్నవి. పాత్రలు పలువు రుండరు; ఏనలుగురైదుగురో. అన్నియును సమ కాలపు సంఘనురాచారములనే ఖండించునవి. సుప్రసిద్ధులయు, ధనికులయుగాక సాధారణజన జీవితము నే యితివృత్తముగాగలవి. అప్పుడప్పుడు రాజకీయములు చర్చింపబడినను, సాధారణ ముగా నన్నిటియందును సామాన్యుల సాంసారికమే చిత్రింపబడినది. వ్యక్తులకును, సంఘము నకును సతితము తటస్థించు సంఘర్షణయే వాటికన్నిటికీ బ్రియతమమైన సన్ని వేశము. వ్య క్తుల మానసిక ప్రవృత్తులయందు తటిల్లతలవలె క్షణక్షణము సంభవించు మార్పులను తత్కారణములతో జిత్రించుటయే వాని ముఖ్యాశయము.

“సంఘ స్తంభముల”యొక్క కథానాయకుడు కార్సటజ్బర్నిక్ అనునతడు. పైకి మర్యాదస్థుడు; కాని నిజముగా మాయావి. కేవలము స్వార్థపరుడు; కాని సంఘమున కాదర్శ పూరుషునిపలె గాన్పించును. తనయూరియందు రైలు వేయునుద్యమము బయలు దేరినప్పుడు తనయోడపర్తకమునకు నష్టము రావచ్చునని జంకి దాని నడ్డగించును. కాని తనభూములమీదుగా వేయబడనున్న రైలువలన తన కెక్కువలాభమువచ్చునని గ్రహించి, దానికై పాటుపడును. వివాహితయైన యొకనర్తకితో సంబంధముగల్గి యుండియు, లోకమునకు జంకి, ఆనిందను మటొకని పై మోపును. తనకంపెనీలో డబ్బులేనప్పుడు, దొంగతనమువలన డబ్బు వ్యయమై నట్లు వదంతిని బుట్టించి, ఆ నేరమును తాత్కాలికముగా నొక స్నేహితునిపై మోపును, ఆతడు శిథిలమైన తనయోడమీద అమెరికాకు బయనము కాగా, ఆతనిమృతి తన కన్ని విధముల సహా యకారి యగునని తలచి, తక్షణమే యాపడవ రేవు వదలుట కాజ్ఞ యిచ్చును. కాని తనకుమారు డాపడవయందే దాగియున్నాడని తెలియవచ్చినప్పు డీత నిదుఃఖమునకు మేరయుండదు. ఈ విషాదానలమే యాతని శుభ్రపఱచి, మార్చివేయును. ఇదివఱకు రోర్ లెండు మొదలగువారు "తెల్పుచుండిన సంఘనీతికిని, ఆదర్శములకును లొంగియుండి, తన వ్యక్తిత్వము చంపికొనిన తెఱం గాతనికి విశదమగును. అట్టిజీవితము హెయమని తలచి, యాతడు తననైజము నెల్లరకును విశదీకరించి, సంఘనీతికి దాసులై మెలగు తదితరులను గూడ సంస్కరింపబూనుకొనును. సంఘ మర్యాదకు లొంగని స్త్రీ లీనాటకమున మువ్వురు. ఒక్కతె నర్తకియొక్క కుమార్త. తాను