పుట:Naatyakala maasapatrika, sanputi 1, sanchika 2, april 1935.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధురిమలో నాట్యకళయు కొంత తావు దొరకించుకోసం జూచుచున్నది. మాధవపెద్దిలో పద్దతనము బలియుచున్నది. యుగంధరుడుని నేర్పు, మందరభంగి, చాకిత అమాయికత, బోగముపిల్ల హోరంగు, దానిపేడియన్న పై హంగు, మొదలగునవి కళాభిజ్ఞుల హృదయమున ముద్రితము లాయెను.

    లబ్ధ ప్రతి8ష్ఠులగు వీరలమాట యిటుండ దాడి గోవిందరాజులుగారును, బందా కనకలింగేశ్వరరావుగారును, వసంతసేనయు, శ్రీరంజనీవసంతాదేవులును ఇమముందు నాతులసంఖ్యను వృద్ధిచేయగలదని8 యనిపించిరి.  గోవిందరాజులుగారి దిప్పకే గొప్పస్థానము.
                                జ్ఞా నా భి వృ ద్ధి
     నటులీరీతిగా నాట్యాభివృద్ధి చూపుటయ కాదు.  కళాపరిజ్ఞానమును గూడ ఆఱితేఱుచున్నారు.  వారు వారి ప్రదర్శనములందు అననుకూలములయిన ఘట్టములను తెలిపిరి.  పండితులతో చర్చించిరి.  పద్యములు పనికిరావనిరి.  స్వగతములు, అపవార్యలు కూడవనిరి  దీర్ఘోపన్యాసములు రోసిరి.
     ఈ యభిప్రాయములు రాఘవాచార్యులవారు తెలిపినచో విశేషములేదుకాని సారస్వత సంబంధ మంతగా లేని8 నటులు తెలుపుట విశేషము.  నాట్యము వీరికి కొంతకొంత అనుభవమునకు వచ్చినటులు దీనివలన తెలియనగుచున్నది.
      పది పండ్రెండేండ్లక్రింద ఏలూరులో ఒక ప్రదర్శనమున కేగితిని.  బి.యే. ప్యాసుచేసిన ఒక సుప్రసిద్ధనటుడు శివాజీవేషము ధరించెను.  ఆనటునకు పర్యమును, పాటయును లేదు.  అల్లరి ఆరంభమాయెను.  క్రమముగా దక్షాధ్వర ధ్వంసము జరిగెను.  నేటికిని అదియే అవస్థ.
       సంస్కృతనాటకముల కాలములో రాజుగాని, దైచ్వముగాని సభాపతి నాటకమున రసంఊ ప్రధానము.  నటుడు రసజ్ఞుడును, సహృదయుడును, సత్త్వము, భావన, రసకావ్యపఠనము కల సహృదతయే టికెట్టు.
        ఇపుడు డెమాక్రసీయే సభాపతి. నాటకమున రచనాసౌందర్యమే ప్రధానము. నటుడు ఆర్టు-పక్షపాతి.  డబ్బుపెట్టి కొనదగినకాకితమే టిక్కెట్టు.