పుట:Naatyakala maasapatrika, sanputi 1, sanchika 2, april 1935.pdf/13

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


సింహావలోకనము

వేలూరి శివరామశాస్త్రి

                పూర్వరంగము

1911 సాలు చివరనెలలో గుంటూరున ఒకటిరెండు నాటకములు చూచితిని. అవి పాండవవిజయము, వేణీసంహారము. ఈ రెంటినే రెండుమూడు తడవలు చూఛవలసివచ్చెను. పిదప నాటకములు చూచుట శుద్ధ-తప్పు అని తోచెను. ఏలనగా ఈ చాక్షుషక్రతువునందు పశుహింస యెక్కువ.

     అయినను నాటకమునకు వెళ్లకుండుటకు వీలుకలుగలేదు. అవి మా శతావధానపు రోజులు. ఆంధ్రదేశమున నాట్యకళ అపుడపుడే తప్పటడుగులు వేయుచుండెను. నటులు మ మ్మీకనువిందులకు ప్రేమపూర్వకముగా ఆహ్వా నించుచుండెడివారు. విందుకు వెంకంజవేరాదుగదా! విశేషించి 'అనాహుతోమధ్వరం గచ్చత్ ' అని కలదు.
   కాని రంగముమీద పాత్రప్రవేశించిన పదినిమిషములకు కనులను అంతర్ముఖ మొనరించ్కొని చెవులను దొరబెట్టుకొని యుండవలసి వచ్చెడిది-

'ఏకో ధీర: ప్రత్యగత్మాన మైక్ష దనృత్తచక్షు రమృతత్వ మిచ్చన్.' అంకాంతమునందే మరల కనులకు పని. అపు డీరీతిగా చాల నాటకములను వింటిని.

     సభ్యులలో రసికులు నిమ్మకునీరెత్తినటు లుండియుండి మంచిపద్యము వినబడగనే 'వన్ స్ మోర్ ' కొట్టెడువార్. నటులును మంచి బడిపిల్లకాయలవలె పాఠ మప్పగించుచుండేడివారు. ఆకాలమున వన్ స్ మోరుల సంఖ్యాధిక్యమే నటుని గొప్పదనమునకు నిర్ణాయకము.
   ఏడాది తిరుగకముందే నటపరీక్షల కంకురార్పణ మాయెను. గయో పాఖ్యానమున ఒక ఘట్టము పరీక్ష్యము. ఒక బంగారుపతకము కానుక. దానికి పరీక్షకులు ఏదుగురు. ఇందఱ నేల నియమించిరో. ఏ;అ వారంగీకరించిరో, నా కిపుడు గుఱుతుచాలదు. వారు కోరుటయు, వీ రియ్యకొంటయుమాత్రమే కారణమనుకొందును. నేనుగూడ ఒక పరీక్షకుడను (judge.)