పుట:Naajeevitayatrat021599mbp.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూనూరు వెళ్ళింది. ఆ కాలంలోనే అనుకుంటాను. హేమ్నెటూ, ఫోర్ప్సూ పెరంబూరువరకూ కలిసే ప్రయాణం కలిసే ప్రయాణం చేశారనీ, ఆ లోగా ఈ విషయమే మాట్లాడుకున్నారనీ నాకు తెలిసింది. ఉభయులూ కూనూరులో కూడా ఈ విషయమే ప్రస్తావన చేసుకున్నట్లు ఫోర్‌బ్సు వేసిన ప్రశ్నలనిబట్టి నాకు బాగా నిర్దారణ అయింది. ఫోర్‌బ్సు మద్రాసు చేరాక నే నాయన్ని చూశాను. ఇంతకాల మయ్యాక నాకు జ్ఞాపకం వున్నంతవరకూ మా సంభాషణ వివరిస్తాను.

ఆయన నన్ను, "మీకు ఇల్లు లేదుట కదా!" అని అడిగాడు. నేను "లేదు - చైర్మన్ పనికి ఇల్లు ఎందుకుండాలి? రాజమహేంద్రవరానికి ఫ్రొఫెసర్ వుద్యోగం చెయ్యడానికి వచ్చిన ప్రతి అలాయిదా మనిషీ ఛైర్మన్ ఉద్యోగం చెయ్యగా నేనెందుకు చెయ్యకూడదూ? ఇంటి సంగ తెందుకు?" అని అడిగాను. దాంతో ఆయన తెల్లబోయాడు. తరవాత నేను రాజమహేంద్రవరం పరిస్థితులన్నీ వివరించాను. "రిప్పన్‌ప్రభువు పరిపాలన ప్రజలవశం చెయ్యడానికి మునిసిపల్‌చట్టం నిర్మిస్తే, పరిపాలనకి సంబంధంలేని కారణాలు పెట్టుగుని గెజెట్ చెయ్యకుండా వుండడం ఎక్కడైనా ఉందా? ఇల్లాంటి దారుణం ఎప్పుడైనా విన్నారా?" అని అడిగాను. ఆ తరవాత, "జీతం భత్యం లేని ఈ పనికి యింత అభ్యంతరం ఏమిటి?" అని కూడా అడిగాను. దానికి ఆయన సమాధానం చెప్పకనే, "నాకు వచ్చిన పిటీషన్ సంగతి మీకు ఎల్లా తెలిసింది?" అన్నాడు. నేను "మీ పిటీషన్ సంగతి రాజమండ్రిలో వున్న ముసలమ్మ లంతా నడిబజారుల్లో చెప్పుకుంటున్నా,"రని చెప్పాను. ఆయన 'ఎందుచేత?' అని అడిగాడు. "ఊరికల్లా ప్రథమ పౌరుడైన వ్యక్తిమీద ఈర్ష్యాళువులు వ్రాసే కాగితం విచారణ చెయ్యడానికి మామూలు ఉద్యోగస్థులకి పంపితే తెలియక ఏమి అవుతుంది! నా అర్హతని గురించి రిపోర్టు చెయ్యడం గ్రామమునసబా?" అని అడిగాను.

అందుకు ఆయన ఉలక్కుండా పలక్కుండా ఊరుకున్నాడు. ఆపైన కోలాచలం వెంకట్రావు ఎన్నికల్లో కాసుల సంగతి అడిగాడు. నేను దానికి కూడా తగిన జవాబు చెప్పి, "నా యిష్టంవచ్చిన అభ్యర్థికి