పుట:Naajeevitayatrat021599mbp.pdf/911

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"హోమ్ మంత్రిగారు చేసిన ప్రశంసకు అదనంగా నేను చెప్పగలిగింది లేదు. నాకు జ్ఞాపకమున్నంతవరకు 1920 ప్రాంతాలనుంచి 35 సంవత్సరాలుగా ప్రకాశంగారితో నాకు సాహచర్యం ఉన్నది. ఒక్కొక్కప్పుడు సంపూర్ణంగా మేమిద్దరం ఏకీభవించకపోయినా, ఆయన గుణసంపత్తిని నేను ఎప్పుడూ ప్రశంసాభావంతోనే గ్రహించేవాడిని.

నిత్య జాగరకమైన ఒక శక్తి, నిస్సందేహంగా ఆయనలో ఉండేది. వయోవృద్ధులైన తర్వాత, మానవులకు సహజంగానే కొంత శక్తి తగ్గడం చూస్తూంటాము. అయినప్పటికీ ప్రకాశంగారు కార్యాచరణలో చూపించే జాగృతి, శక్తి, త్యాగదీక్ష, కార్యదక్షత మన స్మృతిపథంలో స్ఫుటంగానే ఉన్నాయి.

మహా వ్యక్తి మన మధ్యనుంచి వెళ్ళిపోయారు. ఆయన మహత్వం ఆంధ్రదేశ నిర్మాతగా మాత్రమే కాదు. భారత రాజకీయ రంగమందంతటా ఆయన ప్రభావ ముండేది. ఆయన కీ రోజు మనం, ఈ విధమైన ప్రశంసాపూర్వకమైన అంజలి చేయడం చాలా ఉచితమైన పని."

"బ్రిటిష్ తుపాకులకు గుండె చూపిన సాహసి"

ఆయన తర్వాత లోక్ సభ అధ్యక్షుడు (స్పీకరు) శ్రీమాన్ మాడభూషి అనంతశయనం అయ్యంగారు ఇలా అన్నారు:

"ప్రధాన మంత్రిగారు హోమ్ మంత్రిగారూ చెప్పిన మాటలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా నాకు చాలా దు:ఖంగా ఉన్నది. ప్రకాశంగారితో కలిసి, ఆయన నాయకత్వాన పని చేసే అవకాశాలు నాకు చాలా కలిగాయి. ఆయన సంపన్నమైన పరిస్థితులలో తన జీవితం ప్రారంభించకపోయినా, రానురాను అత్యున్నతంగా పెరిగి, ఆంధ్రదేశానికి అగ్రనాయక స్థానం పొందారు. ఆయనకు గల దృఢ నిశ్చయం కార్యదీక్ష అనుపమాన మైనవి.

మనం సైమన్ బాయ్కాట్ (1928) చేసిన సమ