పుట:Naajeevitayatrat021599mbp.pdf/910

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోతున్నాయా అన్నట్టు, చితిపై అగ్ని జ్వాలలు, ఆకాశమార్గానికి ఎగిసి వెళ్లాయి.

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశంగారి ఆత్మజ్యోతి, విశ్వజ్యోతిలో కలిసిపోయింది.

ఆంధ్ర హృదయాలలో చీకటి సుడులు తిరిగింది

లోక్‌సభలో జోహర్లు

21 వ తేదీనాడు లోక్‌సభలో గోవింద వల్లభపంత్‌గారు ఇలా అన్నారు.

"నూతనాంధ్ర నిర్మాత"

" ఈ ఉదయం పత్రికల్లో ప్రకాశంగారి మరణవార్త పడింది. ఇది అతి విషాదకరమైన వార్త. ప్రకాశంగారి జీవితం, దేశసేవకే అంకితమైన జీవితం. స్వాతంత్ర్య సమరంలో, ఆయన ప్రముఖమైన పాత్ర వహించారు. త్యాగాలు చేశారు. కష్టాలు పడినారు. ఎప్పుడూ సమరవాహినిలో ముందుగానే నడిచేవారు. ఆంధ్రదేశానికి ఆయనయందుగల అభిమానం, గౌరవం అపారములు.

ఆయన నూతన ఆంధ్రదేశానికి నిర్మాత. ధైర్యసాహసాలకు పెట్టింది పేరు. నిర్మాణ కార్యప్రతిపాద నాత్మకమైన అభిజ్ఞత ఆయనకుండేది. జీవితంలో ప్రతిక్షణం - ఆయన మేధస్సులోని ఊహా వై శిష్ట్యం, దేహమందుగల శక్తి భారత దేశసేవకూ, ముఖ్యంగా ఆంధ్ర ప్రజాభ్యుదయానికీ వినియోగించారు.

ఆయన కుటుంబనికి లోక్‌సభ సానుభూతి అందజేస్తున్నాను."

"త్యాగదీక్ష, కార్తదక్షత గల మహావ్యక్తి"

ఆయన తర్వాత, భారత ప్రధాని పండిత జవహర్‌లాల్ నెహ్రూగారు ఇలా అన్నారు: