పుట:Naajeevitayatrat021599mbp.pdf/909

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాయుధ పోలీసుదళములు మూడుసార్లు సామూహికంగా తుపాకులు పేల్చారు. స్వర్గస్థులయిన ప్రకాశంగారికి కడపటి వందన మది. అ సమయంలో అంత్యనాద వాద్య (Last bugle) బృందం, ప్రకాశంయుగం అంతమైందని భారత ప్రజలంతా వినేటట్టుగా, దశ దిశలు మారుమ్రోగేట్టు ప్రకటించారు.

రాజాజీ - భారతదేశ స్వాతంత్ర్య సమరంలో ప్రక్కప్రక్కగా నిలబడి, ప్రకాశంగారూ తానూ నడిపించిన కార్యాలకు స్మృతిచిహ్నంగా, ప్రకాశంగారి చితిపై ఉంచడానికని ప్రత్యేకంగా, మంచి గంధపు చెక్కను, పిడికెడు బియ్యాన్ని పంపారు. చితి అంటించేముందు బంధుమిత్రులు స్వర్గస్థులైన వారినోట బియ్యంవేయడం దక్షిణ హిందూదేశ ఆచారము.

శ్మశానవాటికలో 'భుగ, భుగ' మండే అగ్నిజ్వాలలు స్వర్గస్థులైనవారి చితిని దహించే వేళ, ఉపన్యాసా లిచ్చేవేళ కాదు.

అయినా, పాశ్చాత్య పద్ధతుల ననుసరించి - సహచర రాజకీయ నాయకులు స్వర్గస్థులైనవారి భౌతిక దేహదహన సమయమున, ప్రశంసాపూర్వకమైన ఉపన్యాసాలు ఇవ్వడాన్ని, స్వాతంత్ర్యానంతరం మననాయకులు అదొక బలవత్తరమైన అలవాటుగా చేసుకున్నారు.

గవర్నరు త్రివేదిగారు పంపిన సందేశం ముఖ్య కార్యదర్శి పాయ్‌గారు చదివారు. సంజీవరెడ్డి, కళా వెంకటరావు, అల్లూరి సత్యనారాయణరాజు గారలు భౌతికదేహాన్ని స్వర్గవాహకమైన చితిపై అమర్చారు. అప్పటి వేదోక్త కార్యక్రమాన్ని మైలవరపు లక్ష్మీనారాయణగారు నడిపించారు.

సంజీవరెడ్డి, పద్మభూషణ్ మాడపాటి హనుమంతరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, కొండా వెంకటరెడ్డి, కళా వెంకటరావు, నూకల సరోత్తమరెడ్డి, అల్లూరి సత్యనారాయణరాజు, వి. వి. రాజుగారలు - ప్రకాశంగారి నాయకత్వ లక్షణాలను, ఆయన జీవితంలోగల కృతార్థతను 'నభూతో, న భవిష్యతి' అని, పలువిధములుగా భాషాపటిమతో ప్రశంసించారు. వారి ప్రశంసా వాక్య సందేశాన్ని స్వర్గసీమకు తీసుకు