పుట:Naajeevitayatrat021599mbp.pdf/906

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్జల్‌గంజి, సిద్ధి అంబర్ బజారు, ఉస్మాన్ గంజి, ముజమ్‌షాహి రాజపధము మొదలైన రస్తాల గుండా ప్రకాశంగారిని తీసుకువెళ్ళే అంబులెన్సు బండీ వెళ్తున్నప్పుడు రెండు ప్రక్కల ప్రజలు దట్టమైన వరుసలలో నిల్చున్నారు. వారి ముఖాలలో, కళ్ళల్లో - చెప్పలేని ఆర్తి, స్పష్టంగా వ్యక్తమయే భక్తి కనిపించాయి.

విశ్రాంతి ఎరుగని కర్మవీరునికి సుదీర్ఘ విశ్రాంతి
(Courtey: Director of Inf/ & Pub.Relations, Govt. of Andhra Pradesh.)

గాంధీ భవనం దగ్గర ఒక ఎత్తయిన వేదిక కట్టారు. దానిమీద మంచుదిమ్మలు పరిచారు. వేదికకు నాలుగువైపుల రంగు రంగుల ముగ్గులు పెట్టి, నాలుగు మూలలా నాలుగు దీపస్తంభములు నిలిపారు. చుట్టూ పువ్వులు వరుసల్లో పేర్చారు. వలయాలుగా చుట్టుకుంటూ, వేదిక చుట్టూ ఉన్న అగరువత్తిధూపములు, అఖండంగా సుగంధాన్ని వ్యాప్తం