పుట:Naajeevitayatrat021599mbp.pdf/901

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందర్బం చూసుకొని, ఉపన్యాసంలో ఇలా అన్నారు. "నేను ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఉపముఖ్య మంత్రిగా ఉండేవాడిని. ఇప్పుడూ ఉపముఖ్యమంత్రిగానే ఉన్నాను. ఇప్పటి మాటకేమిలెండి. చేస్తే ప్రకాశంగారితో కలిసే మంత్రిపని చేయాలి. ఆ వేగం, ఆ కార్యదీక్ష, ఆ ప్రజా సంక్షేమప్రేమ - మరే ముఖ్యమంత్రి పరిపాలనలోను కలుగవు అని నా మనస్సులో నిశ్చయమైంది!"

ఆవేళ నిజంగా ఆయన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పారు.

ఒకక్షణం ప్రకాశంగారి పరిపాలనా రథం - ప్రేక్షకులకు, శ్రోతలకు కళ్ళలు కట్టినట్టు కనిపించింది.

24

విశ్రాంతి ఎరుగని కర్మవీరునికి సుదీర్ఘ విశ్రాంతి

అప్పటికే ప్రకాశంగారు వృద్ధులైపోయారు. ఆయన 1954 లో బెంగుళూరు ప్రైవేటు హాస్పిటలులో కేటరాక్టు (కంటితిమిరం)కు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దృష్టి కొంచెం తగ్గినట్టుగా ఇతరులకు అనిపించేదిగాని, ఆయన కన్ను నిండా తెరవకుండానే దూరంగా ఉన్నవారిని బాగా పోల్చుకోగలిగేవారు. ఇతరులు చెప్పింది అవగాహన చేసుకోవడంలో ఎటువంటి మాంద్యమూ ఉండేది కాదు. చదువుకోడానికి కాగితం కంటికి బాగా దగ్గరగా పెట్టుకోవలసిన అవసరం మాత్రం వచ్చింది. అయినప్పటికీ, కాగితంలో ఏ బాగంలో ఏ విషయం ఉందో ఆయనకు బాగా జ్ఞాపకముండేది.

ఒక రోజున కాబినెట్ మీటింగులో, నెహ్రూగారి దగ్గరినుంచి వచ్చిన ఒక ఉత్తరం చదివి వినిపిద్దామనుకొన్నాము. మాతో - తాను స్వయంగా చదవలేనందుకు ఏమీ అనుకోవద్దని, పర్సనల్ అసిస్టెంటును పిలిచి చదవమన్నారు.

ఆ చదవమనడంలో, మా కోరిక ప్రత్యేక విషయం చెబుదామని ఆయన ఉద్దేశం పెర్సనల్ అసిస్టెంటు ఆ కాగితం చదువుతూ,