పుట:Naajeevitayatrat021599mbp.pdf/892

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకరి పేరు చెప్పి, ఆ వ్యక్తిని ఈ ఏర్పాటులోంచి తప్పించగూడ గూడదన్నారు.

ఆ పేరు చెప్పేసరికి, నెహ్రూగారు మండిపడి, "ఆ.... పేరు మీరు ఎత్తకండి" అని కోపంగా, మరి మారుమాట చెప్పడానికి వీలు లేదన్నట్టు అన్నారు.

నెహ్రూగారు అంత కోపంగా ఏ వ్యక్తి గురించి అయినా అప్పుడు అన్నమాట మరే సందర్భంలోనూ నేను ఆయన నోటి వెంట వినలేదు.

ఇది అయిన తర్వాత, నెహ్రూగారు మమ్మల్ని లాల్‌బహదూర్ గారికి అప్పజెప్పారు.

అప్పు డింకా పార్లమెంటు జరుగుతున్న రోజులు. పార్లమెంటు భవనంలో గల శాస్త్రిగారి గదిలో మిగిలిన కార్యక్రమం ఆరంభమయింది. మేనిఫెస్టో (ప్రణాళిక)లో ఏయే అంశాలు చేర్చుకోవాలనే విషయంపై పది నిమిషాలు చర్చించాము. అది నిశ్చయం కాగానే, మర్నాడు కలుసుకుందామని అప్పటికి విడిపోయాము.

మర్నాడు శాస్త్రిగారి గదిలోకి నేను వెళ్ళేసరికి, ఆయన ఒక ప్రణాళిక ముసాయిదా తయారుచేసి ఉన్నారు. అది దీర్ఘమైనది కాదు. మూడు పార్టీలకు అంగీకారమైన భాషలో వ్రాసి ఉంది.

అయితే, ఈ మూడు పార్టీలకూ కలిపి ఆయన "సంయుక్త కాంగ్రెసు విథానమండలి పార్టీ," అని పేరు పెట్టారు. నేను ఆ పేరువద్దన్నాను. మేము కాంగ్రెసులో విలీనం కానపుడు, మా పార్టీ సభ్యులు, దానికి అంగీకరించరని నేను చెప్పాను. ఈ సమస్య చాలాసేపు తేలలేదు. శాస్త్రిగారు - ఒక మనిషి నిచ్చి, మౌలానా ఆజాద్‌గారి గదికి పంపించారు.

ఆజాద్‌గారితో నాకు చను వెక్కువ లేకున్నా నన్ను, ఆయన - 1928 నుంచి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలలోను, తర్వాత 1946 లో ప్రకాశంగారి మంత్రివర్గ నిర్మాణ సంబంధమయిన తగాదాలోను తరచుగా చూస్తూండడంవల్ల, నా విషయం తెలిసినవారే. ఆయన