పుట:Naajeevitayatrat021599mbp.pdf/891

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెద్ద అక్షరాలతో పత్రికలలో పడ్డాయి. చెన్నపట్నం పత్రికలలోనూ పడే ఉంటాయి.

అప్పటికి, ఏలూరులో రాష్ట్రకాంగ్రెసు కమిటీవారు సమావేశం కావడానికి ఏర్పాటు జరిగింది. ఇక్కడ వీరు, "ఈ విశ్వనాథం ఎవరు? ఈయనతో, మాకు ఒడంబడిక ఏమిటి? పత్రికలలోపడ్డ వార్తలు నమ్మడం ఎలా? మాకు స్వయంగా నెహ్రూగారినుంచి కబురువస్తే తప్ప, మా ఏర్పాట్లు మావే," అని పత్రికలవారి ముందు చెప్పగా, మర్నాడు పత్రికలలో ఆ వార్తలన్నీ పడ్డాయి.

పరిస్థితి చెడిపోకముందే, బలవంతరాయ్ మెహతాగారు - కళా వెంకటరావు ప్రభృతులకు కటకం ఏర్పాట్లు వివరించడానికి ఒక కాంగ్రెసు పెద్దను పంపడం జరిగింది.

ఆ పైని కాంగ్రెసు పార్టీవారు సజావుగా నాతో మాట్లాడి, మిగిలిన కార్యక్రమం సాఫీగా జరపడానికి అంగీకరించారు.

నే నీలోపునే ఆచార్య రంగాగారికి జరిగినదంతా చెప్పగా, భవిష్యత్ దృష్ట్యా, ఆయన ఈ కలయికలో భాగస్వామి కావడానికి వెంటనే అంగీకరించారు.

సోషలిస్టు నాయకులైన పి. వి. జి. రాజుగారినికూడా ఈ కలయికలో చేరవలసిందని నేను ఆహ్వానించినా, ఆయన నిరాకరించారు.

ఢిల్లీలో నెహ్రూగారితో సమావేశము

నెహ్రూగారు చెప్పిన తేదీకి మేము ఢిల్లీ వెళ్లాము. అక్కడ, రంగాగారు కూడా హాజరయి ఉన్నారు. సమావేశంలో లాల్‌బహదూర్ శాస్త్రిగారు కూడా కూచున్నారు.

కర్నూలులో ప్రభుత్వం జరుగుతున్నప్పుడు - కాంగ్రెస్ పార్టీకి చెంది, విశ్వాసరాహిత్య తీర్మానం వోటింగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వోటు చేసినవారిని తప్ప, మిగిలిన వారందరిలో ఎవరు చేరినా చేర్చుకోవచ్చునన్నారు నెహ్రూగారు.

దానిపై రంగాగారు అటువంటి ఒక పేరు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెంది, విశ్వాసరాహిత్య తీర్మానానికి వ్యతిరేకంగా వోటు చేసిన