పుట:Naajeevitayatrat021599mbp.pdf/889

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పుడు ఎన్నికల విషయమై చర్చ ఆరంభించగా, నేను - ఒకే ఎలక్షన్ ప్రణాళిక (మానిపెస్టో), ఒకే సెలక్షన్ కమిటీ అన్న నా సూత్రాన్ని చెప్పగా, ఆయన తొందరగానే దానిలోని బలం గ్రహించి, అంగీకరించారు.

రాత్రి భోజనానంతరం నెహ్రూగారు, బలవంతరాయ్ మెహతాగారు, నేను - గవర్నరుగారి డ్రాయింగ్ రూములో కూచోడానికి వెళ్ళాము

ఒక కుర్చీపైని రంగు రంగుల శాలువ వంటిది కనిపించగా, నెహ్రూగారు దానిలో కూచోబోయేసరికి, చటుక్కున క్రిందికి దిగజారారు. ఆయన, ఆ రోజుల్లో బలంగా ఉన్నవారే గనుక, ఆ ప్రక్కనున్న మేము వెంటనే ఆయనకు సాయపడి నిల్చోబెట్టడంలో కష్టమేమి లేకపోయింది. అప్పుడు, బాగా ఉన్న సోఫాచూసుకొని ఆయన కూచున్నారు.

ఆయనకు - నన్ను పేరుపెట్టి పిలిచేటప్పుడల్లా, నా పేరు చివర ఉన్న 'థం' అన్న అక్షరాన్ని బలంగా, గట్టిగా ఉచ్చరించడం పూర్వపు అలవాటు. నేను కాంగ్రెసు వదిలిన తర్వాత మేము తరచుగా కలుసుకోకపోయినా, నన్ను ఆ విధంగా పిలవాడాన్ని ఆయన మరిచిపోలేదు. పేరుపెట్టి పిలిచి, ఆయనే సంభాషణ ప్రారంభించారు: "నీకేమో కాంగ్రెసులో పున:ప్రవేశం చేయడానికి మానసికమైన అభ్యంతరాలున్నాయని బలవంతరాయ్ మెహతా అంటున్నాడు. అది ఎంతవరకు సరి అయిన అభిప్రాయం?"

దానిపై నేను, "మనం కలుసుకున్నది, ఎన్నికల వ్యూహం పన్నడం కోసం కదా? పార్టీ విడిచిపెట్టి, మీ పార్టీలో చేరాలన్నట్లయితే - అది ఏదో సహజమైన, చారిత్రక ప్రవాహంలో జరగవలసిన పని. కాని, ఎన్ని