పుట:Naajeevitayatrat021599mbp.pdf/887

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెసుపార్టీ అంగీకరిస్తే భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే, ఎవరికి వారే యమునా తీరే' అన్నట్టు, అందరూ చీకాకు పడవలసిన అవస్థ వస్తుంది."

నాకు తోచిన పై విషయాలు వారితో చెప్పగా, వారు వెంటనే అంగీకరించారు. పత్రికలు కూడా సుముఖతను చూపించాయి. అయినా రాష్ట్రపతి ఉద్ఘోషణ 6 నెలలు అమలు జరగడానికి ఏర్పాటు కావడంచేత, 4, 5 నెలల వరకు అన్నీ పార్టీలవారు తమ తమ ఎన్నికల సన్నాహాలు చేసుకొనే అవకాశం వచ్చింది.

ఎన్నికల కాలం వచ్చేసరికి, కాంగ్రెసు పార్టీవారు తమ యత్నం తాము చేసుకుంటూ ఉన్నారు. నేను చెప్పిన సూత్రం - ఆ తేదీ నాటికి, రాష్ట్ర కాంగ్రెసు సంస్థలో అధికారంలో ఉన్నవారు పాటించడానికి ఇష్టులుగా లేరు. అయితే, మరో ప్రక్కనుంచి ప్రకాశంగారిని కాంగ్రెసులో కలిసిపోవలసిందని, ఆయనమీద అభిమాన మున్నవారు వత్తిడి చేయడం మొదలు పెట్టారు.

ఇలా ఉండగా, గుంటూరులో కాంగ్రెసుపార్టీ సమావేశం జరిపారు. ప్రజాపార్టీ సమావేశాన్ని అదే సమయంలో గుంటూరులో ఏర్పాటు చేశాను. మా సమావేశం జరుగుతూండగా, కాంగ్రెసు పార్టీవారి ఆదేశ ప్రకారం ముగ్గురు నలుగురు కాంగ్రెసు సభ్యులు మా సమావేశ వేదికకు ఏదో సందేశం ఇవ్వడానికి వస్తామని కబురు పెట్టారు. వారిని నేను ఆహ్వానించాను.

ఆ వచ్చిన వారిలో - శ్రీమతి అమ్మన్నరాజా, శ్రీమతి కడప రామసుబ్బమ్మగారు ఉన్నారు. వారు చెప్పిన సందేశ సారాంశం ఇది: "ప్రజాపార్టీవారు, కాంగ్రెసువారు కలిసి 13 నెలలు రాజ్యం నడిపించారు. హెచ్చయిన భేదాభిప్రాయాలు ఇద్దరి మధ్యనూ కనిపించ లేదు ప్రజాపార్టీలో ఉన్నవారు 90 శాతం పూర్వ కాంగ్రెసువాదులే. కనుక, మొత్తంమీద, ప్రజాపార్టీ అంతా కాంగ్రెసులో పున: ప్రవేశించవలసింది."

లోగడ జరిగిన కొన్ని విషయాలవల్ల, ప్రజాపార్టీలో ఎవరూ