పుట:Naajeevitayatrat021599mbp.pdf/881

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇది సచివాలయంవారు సరిగ్గా కనిపెట్టలేదు. ఒక రోజు అకస్మాత్తుగా, మధ్యాహ్నం 12 గంటల వేళప్పుడు, రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు కేంద్రప్రభుత్వానికి వెళ్ళడానికి ఇంక వ్యవధి లేదని, సచివాలయంనుంచి కాగితాలు ప్రకాశంగారి దగ్గరికి, నా దగ్గరికి వచ్చేసరికి - అందులో, ఈ వ్యవహారంలో గవర్నరుగారు అనవసరంగా ప్రమేయం కల్పించుకొని ప్రారంభించిన ప్రత్యేక ఫైలు బయటపడింది.

తక్షణం ప్రకాశంగారు ముఖ్యకార్యదర్శిని పిలిపించి, "ఈ వ్యవహారంలో గవర్నరుగారికి, మనకు ఏమి పరిష్కారం కాగలదు?" అని అడిగారు.

అప్పటి కప్పుడే మంత్రివర్గం రెండు భాగాలు అవుతున్న పరిస్థితి ఏర్పడుతూంది. దానికితోడు గవర్నరుగారు, ఈ క్రొత్త తంటా తీసుకొస్తే ఏమి చేద్దాము అన్నారు ప్రకాశంగారు. అయితే, ఈ ఫైలుకు సంబంధించినంత మటుకు మంత్రులం నేను, ప్రకాశంగారు ఇద్దరమే కావడంవల్ల, ఇది పరిష్కరించే మార్గం సులభమయింది.

"ఫైళ్ళమీద వ్రాత వ్రాసుకోవడంకన్నా, గవర్నరుగారి దగ్గరికి మీరు వెళ్ళి, ఈ ఫైలు ఆయనే ఉపసంహరించినట్టుగా చేయగలరు. చేయండి," అని ముఖ్య కార్యదర్శిగారికి సూచించాను. ముఖ్య కార్యదర్శిగారుకూడా కార్య నిబంధనలు బాగా తెలిసిన వ్యక్తి గనుక, ఆయన గవర్నరుగారి దగ్గరికి వెళ్ళి విషయం బోధపరిచాడు.

దానిపై గవర్నరుగారు, అ ఫైలుమీద 'ఈ విషయం ఇటుపైన నడవక్కర లేదు,' అని వ్రాయడమే కాక - ముఖ్య న్యాయమూర్తి, ముఖ్యమంత్రి నిర్దేశించిన పేర్లు తనకూ అంగీకారమే అని, వాటికి సంబంధించిన ఫైలుమీద వ్రాసి, సంతకం చేసేశారు.

22

విశ్వాసరాహిత్య తీర్మానము

అన్ని రంగాలలోను చురుకుగా ముందడుగు వేస్తున్నప్పటికి కూడా, ప్రతిపక్షంవారికి - రాష్ట్రాభివృద్ధి పైని ఆసక్తికన్న, ప్రకాశం