పుట:Naajeevitayatrat021599mbp.pdf/879

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాతో మాట్లాడలేదు. మీ సెక్రటరీగారు నాతో చెప్పలేదు. మీకేమైనా చెప్పారా?"

'లా' సెక్రటరీ నాకుకూడా ఆ విషయం చెప్పకపోవడంవల్ల, నేను ఆయనను పిలిచి ఆ సంగతి అడగగా, ఆయన - నివేదిక పంపించినట్టు ఒప్పుకున్నాడు.

అప్పుడు నేను ఇలా అన్నాను: "అయ్యా, కార్యదర్శిగారూ! మీరూ, గవర్నరుగారూ - మాకు తెలియకుండా కార్యకలాపం ఇలా నిడిపిస్తే, మన రాజ్యంలో గవర్నరుగారి దొకటి; మంత్రివర్గాని దొకటి, రెండు ప్రభుత్వాలు ఏర్పా టవుతాయి. ఒక రాజ్యంలో రెండు ప్రభుత్వాలు - సాగడం కుదురదుగదా, మన సంవిధానం ప్రకారంగా!"

నేను చెప్పింది సరయిందని గ్రహించి, కార్యదర్శిగారు జరిగినదానికి మన్నించమన్నారు.

అప్పుడు నేను - గవర్నరుగారు ఏ రిపోర్టు అడిగినా, రిపోర్టు వ్రాయవలసినదే కాని, అది నా ద్వారానే పంపించాలని ఆదేశం ఇచ్చాను. తర్వాత కార్యదర్శి ఫైలు నా ద్వారా పంపించినట్టు, గవర్నరుగారు చూసి, అప్పుడు నాతో ఈ విషయం చర్చిస్తానని ఆహ్వానించారు.

నాతో తాను యూనివర్శిటీ ఛాన్సలర్ అవడంవల్ల, మంత్రివర్గానికి తెలియకుండా, ఆ పని చేసుకొనే హక్కు తనకు గలదని వాదించాడు. మంత్రి మండలి ప్రసక్తిలేకుండా నివేదికలు వ్రాయమని సచివాలయాన్ని, తాను అడగవలసిన అగత్యం లేదు కదా! అన్నాను. ఇంతేకాక, యూనివర్శిటీ పరిపాలన విషయాలలో గవర్నరు చేసిన కార్యం ఏదైనా విశ్వవిద్యాలయ సభ్యులకు అసంతృప్తిగా ఉంటే, విశ్వవిద్యాలయం స్థాపించడం, నడిపించడం పూచీ ప్రభుత్వానిదైనప్పుడు, దానికి సంబంధించి గవర్నరు నామనిర్దేశనాలు (Nominations) చేసినా వాటి పూచీ ప్రభుత్వం భరించవలసి ఉంటుంది గనుక, ప్రజా ప్రభుత్వంలో 'గవర్నరు' అన్న పదం యొక్క