పుట:Naajeevitayatrat021599mbp.pdf/878

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశంగారికి, ప్రధానిగారు వ్రాసే ఉత్తరాలు చదువుకొన్నప్పుడు, మాకు - గవర్నరుగారు వహించే పాత్ర అర్థమైంది. ఆ తర్వాత ఆయన, ప్రకాశంగారిని వదిలిపెట్టి, సంజీవరెడ్డిగారిని చేరదీయడానికి యత్నించాడు. కాని ఆయనా ఒక కొరకరాని కొయ్య అని రెండు నెలలు అయ్యేసరికి అర్థం చేసుకున్నాడు.

ఆయన మాకు తెలియకుండానే కార్యదర్శులను ఏవేవో రిపోర్టులు తయారుచేయవలసిందని ఉత్తరువులు పంపేవాడు. మాకు తెలియకుండానే అటువంటి రిపోర్టులు కొన్ని సచివాలయంనుంచి గవర్నరుకు వెళ్ళాయి. దానిపై మేము సచివాలయం వారికి ఒక ఆదేశం ఇచ్చాము. గవర్నరుగారు ఏ విషయం అడిగినా, ఉన్న భోగట్టా అంతా వారు పంపించాలి. కాని ఆ పంపే భోగట్టాకానీ, నివేదికగాని అందుకు సంబంధించిన శాఖ మంత్రి ముందుపెట్టి మరీ పంపాలని ఆదేశించాము.

ఆ తర్వత, గవర్నరు దగ్గరనుంచి, తన దగ్గరకు వెళ్ళిన పైళ్ళకు సంబంధంలేని నివేదికలు కావాలనే ఉత్త్వర్వులు చాలావరకు తగ్గిపోయాయి.

ఇలా ఉంటుండగా, ఒక రోజున, విద్యాశాఖామంత్రి నన్ను ఇలా అడిగారు: "విశ్వవిద్యాలయం నామినేషన్ల విషయమై, నాకు తెలియకుండానే మీ 'లా' సెక్రటరీగారిని గవర్నరుకు హక్కులు గలవని నివేదిక వ్రాయమంటే, ఆయన అలాగే గవర్నరుకు హక్కు ఉందని ఆధారాలు చూపిస్తూ నివేదిక పంపించారు. గవర్నరు ఈ విషయం