పుట:Naajeevitayatrat021599mbp.pdf/876

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"సరే, అలాగే కానివ్వండి" అని నేను వచ్చిన పనేదో సవ్యంగానే చేసుకున్నాను. [1]

గవర్నరు త్రివేది

బ్రిటిష్ ప్రభుత్వం ఉద్ధృతంగా జరిగే రోజులలో త్రివేదిగారు ఐ. సి. ఎస్. పరీక్షలో ఉత్తీర్ణుడై, అందరు ఐ. సి.ఎస్. ఉద్యోగులలాగే - అసిస్టెంట్ కలెక్టరు, డివిజనల్ మేజిస్ట్రేటు మొదలైన చిల్లర ఉద్యోగాలతో ప్రారంభించి, సోపానక్రమంగా వెళ్తూ, 1939 లో ఆరంభించిన ప్రపంచ సంగ్రామ కాలంలో ఇండియా కేంద్రప్రభుత్వ కార్యదర్శి వర్గంవరకు పై మెట్లు ఎక్కాడు.

స్వాతంత్ర్యానంతరం, ఎలాగో ప్రభుత్వం సద్భావాన్ని సంపాదించుకొన్నాడు. ఆంధ్రరాష్ట్ర గవర్నరు కావడానికి ముందు పంజాబు గవర్నరుగా ఉండేవాడు. గవర్నరు పదవిలో ఉన్నా, కార్యదర్శి తత్వం ఆయనను వదిలిపెట్టలేదు. దానికితోడు, అధికార వాంఛాపరుడు కూడా.

అందుచేత, పంజాబులో గవర్నరుగా ఉన్నప్పుడు మంత్రులకు

  1. ఈ ఉదంతానికి పూర్వం పుదుచ్చేరిదగ్గర, గోవాదగ్గర, మన ప్రజలు విదేశ ప్రభుత్వాలను వెళ్ళగొట్టడానికని సరిహద్దు ప్రాంతాలలో సత్యాగ్రహాలు మొదలు పెట్టారు. అపుడు ఆ ప్రభుత్వాల వారు, మన దళ నాయకులను హింసించడమే కాకుండా, యునైటెడ్ నేషన్స్ భద్రతా సమితికి, భారత ప్రభుత్వం తమ రాజ్య భాగాలపై దాడి చేస్తున్నదని ఫిర్యాదులు చేశారు. అందుచేతనే, యానాములో భారతీయ సత్యాగ్రహులుగాక, యానాము కాందిశీకులే పునరాక్రమణచేసే ఏర్పాటు జరిగింది. యానాము విషయమై ఫ్రెంచి ప్రభుత్వం భద్రతా సమితికి ఫిర్యాదేమీ చేయలేదు. చేసినట్టు వార్తలు రాలేదు. కాని, నేటికీ నెహ్రూగారి ఏర్పాటుక్రింద యానాము ఆంధ్ర భూభాగంలో చేర్చబడకక, సంఘక్షేత్రం (యూనియన్ టెరిటరీ) గానే ఉంది