పుట:Naajeevitayatrat021599mbp.pdf/874

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెందిన పౌరులు యానాము వదిలి, స్టీమరులో పుదుచ్చేరివైపు వెళ్ళిపోయారట.

నేను యానాము దాటే సమయంలో అక్కడ ఐదారుగురు ప్రెంచి పోలీసులు గార్డ్ ఆప్ ఆనరు వంటిది ఇచ్చారు. నేను యానాముదాటి అవతల వెళ్ళి, అసలు ప్రత్యేకమైన పనిలేకపోవడంవల్ల, అటువైపున ఉన్న మన గ్రామస్థులను కలుసుకొని, రెండు, మూడు గంటలలో తిరిగి వచ్చి, మన సాయుధ పోలీసులకు ఉత్సాహవాక్యాలు కొన్ని చెప్పి, కాకినాడ వచ్చి, ఒక మిత్రునియింట స్నేహితుల నందరినీ చేరదీసి వారికి ఒక కార్యక్రమం సూచించాను.

ముందు కొంత నిశ్శబ్దమయిన ప్రచారంచేసి, యానాము మూడువైపుల నుంచి ఒక వెయ్యిమంది చొప్పున యానాము కాందిశీకులు యానాములోకి ప్రవేశించాలి. వారికి ఇబ్బంది లేకుండా మన సాయుధ పోలీసుదళం అవసరమైతే సాయపడగలదని ఏర్పాటుచేసి కర్నూలు తిరిగి వచ్చేశాను.

ఒక వారం రోజులలో నేను ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చింది. ఒక రోజు ఉదయం నేను ప్రధాని నెహ్రూగారిని చూడవలసి ఉన్నది.

ఆ తెల్లవారుజామున మూడు గంటల వేళ కర్నూలు ప్రభుత్వ కార్యదర్శి నుంచి వైర్‌లెస్ సందేశం వచ్చింది.

పౌరులు వందలకొద్దిగా వెళ్ళి శాంతంగా యానాములో - మునిసిపల్ ఆఫీసు, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు ఆక్రమించుకొన్నారనీ, అక్కడున్న ప్రెంచి పోలీసులు మాటవరసకు ప్రజలను అడ్డేభావంతో పేల్చి, వెంటనే శరణు వేడుకున్నారనీ, అక్కడ ప్రజాప్రభుత్వం [1]

  1. కాకినాడ వాస్తవ్యులు, పదవీ విరమణ చేసిన జిల్లా జడ్జి, నాకు న్యాయకళాశాలలో సహాధ్యాయి అయిన కస్తూరి సుబ్బారావుగారిని, అక్కడ కార్యకలాపాధికారములుగల పురపాలక సంఘాధ్యక్షుని (మేయర్)గా ఎన్నుకొన్నట్టు తర్వాత వార్త వచ్చింది.