పుట:Naajeevitayatrat021599mbp.pdf/873

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయబడి ఉన్నది. కాకినాడనుంచి అక్కడికి దక్షిణంగా ఉన్న యానాం పోవడానికి గంట మోటారు ప్రయాణంకన్నా ఉండదు.

అక్కడి ప్రెంచి ఉద్యోగికి గవర్నరుహోదా ఉండేది. అక్కడి ఫ్రెంచివారు, యానాము భూభాగంలో ఉన్న ప్రజలను, పౌరహక్కులు లేకుండా అణిచివేసే ప్రయత్నంలో, నదికి ఇవతలఉన్న ఆంధ్రరాష్ట్ర ప్రజలపైనకూడా తుపాకులు కాల్చి, గాయపరచసాగారు.

ఆ ప్రజల సంరక్షణకోసం ఆంధ్రప్రభుత్వం సాయుధ పోలీసు దళాన్ని సరిహద్దు రక్షణకు నియమించింది.

ఈ విషయం ఎవరి మూలంగా తెలిసో నెహ్రూగా రొక ఐ. పి. ఎస్. ఉద్యోగిని ప్రత్యేకంగా కర్నూలుకు పంపించారు. ఆయన ప్రకాశంగారితో, తనను నెహ్రూగారు పంపడానికి కారణం మేము యానాముకు ఎదురుగుండా సాయుధ పోలీసు దళం ఉంచడమే నని తేల్చారు.

అందువల్ల, అంతర్జాతీయ సమస్యలు లేస్తాయి గనుక, మేము ప్రెంచివారితో ఏ తగవూ తెచ్చుకో కూడదని ఆయన మాటగా చెప్పారు.

ఆంధ్ర ప్రజలను ప్రెంచివారు తుపాకులతో కాలుస్తూంటే ప్రజలకు ఆ ఇబ్బంది లేకుండా చేయడానికి సాయుధ పోలీసును పంపాము కాని, ప్రెంచివారితో తగవు తెచ్చుకొనే ఉద్దేశం మాకులేదని మాట ఇచ్చాము.

ఆ సమయంలోనే ప్రెంచి పోలీసులు ఒత్తిడి హెచ్చుచేయడం మొదలుపెట్టారు. మేము రిజర్వు పోలీసులు దళాన్ని బలపరచి, వారి ఖర్చుల నిమిత్తం మరొక పదివేల రూపాయలు మంజూరు చేశాము.

నేను యానాముదాటి అవతలకు వెళ్ళేలాగు టూరు ప్రోగ్రాం వేసుకొని, యానాములో ఉన్న ప్రెంచి పెద్ద ఉద్యోగికి మర్యాద ప్రకారంగా ఆ ప్రోగ్రాం ప్రకారం యానాము దాటి వెళుతున్నానని ఉత్తరం పంపించాను. ఆ ప్రకారంగా, నేను యానాము దాటుతున్న సమయానికి ముందురాత్రే ఆ ఉద్యోగీ, ఆయనతో ఉన్న ప్రెంచి జాతికి