పుట:Naajeevitayatrat021599mbp.pdf/872

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొత్తంపైన - నూలు వడికే 23 వేలమంది, ఖద్దరు నేసే 1180 మంది, వీరితో సంబంధించిన దూది ఏకేవారు, బట్టలు తెలుపుచేసే చాకళ్ళు, బట్టలపైన రంగులు అద్దే కళాకారులు లాభం పొందారు.

ఆంధ్ర సరిహద్దుల విషయము

రాష్ట్రం ఏర్పాటు చేసినపుడు సరిహద్దులలో ఇంకా కొన్ని సర్దుబాట్లు చేయవలసి ఉంది. ఇంతేకాక, కేంద్రప్రభుత్వం ఫజలాలీ అనే న్యాయమూర్తి అధ్యక్షతన సెప్టెంబరులో రాష్ట్ర పునర్విభజన సంఘాన్ని నియమించింది. ఆ సంఘంలో హృదయనాథ్ కుంజ్రూ, ఫణిక్కర్ అనే మరి ఇద్దరుకూడా ఉండేవారు.

వారు కర్నూలు వచ్చినప్పుడు, ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దుల విషయము; బళ్ళారి విషయము; చెన్నపట్నం, మైసూరు రాష్ట్రంలోని కోలారు విషయములు - వీటినిగూర్చి ఆంధ్రప్రభుత్వం అనేక వివరాలతో విజ్ఞప్తి దాఖలు చేసింది. ప్రకాశంగారు భాషారాష్త్రాల చరిత్ర యావత్తూ, సమగ్రంగా ఆ సంఘ సభ్యులకు బోధపరిచారు.

ఈ భాషారాష్ట్రాల తత్వ మేమిటోగానీ, పెద్దపెద్ద మహనీయులనుకూడా వక్రమార్గంలోకి దించేస్తాయి.

మరొకప్పుడు, బళ్ళారి విషయమై మిశ్రా అనే న్యాయమూర్తిని స్పెషల్ ఆఫీసరుగా నియమించి, ఆయన బళ్ళారి వెళ్ళే సమయంలో - ప్రకాశంగారు గానీ, ఇతర ఆంధ్ర మంత్రులుగానీ బళ్లారికి వెళ్ల గూడదని నెహ్రూగారు ప్రార్థనాపూర్వకభాషలో ఆంక్ష విధించారు.

ఫ్రెంచి యానాములో ప్రజారాజ్యం

పోర్చుగీసువారు, గోవా ప్రాంతాలలో చేస్తున్న దురంతాలు, మార్గదర్శకంగా తీసుకొని ప్రెంచివారుకూడా దక్షిణాదిన పుదుచ్చేరిలోను, ఆంధ్రలో తూర్పుగోదావరి జిల్లాకు ఆనుకొనిఉన్న యానాములోను - స్వాతంత్ర్యాభిలాషులైన భారతీయులను హింసించ సాగారు.

యానాము చాలా చిన్న భూబాగము. యానాము, గోదావరి భాభాగంనుంచి ఒక కాలువ అంత ప్రమాణంగల నదిచేత వేరు