పుట:Naajeevitayatrat021599mbp.pdf/871

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నశించలేదు. అయినా, ఈ స్కీములు పెట్టిన స్థలాలలో, మిల్లుగుడ్డల వ్యాపారంకూడా జరుగుతూండడంవల్ల వీటి ప్రాధాన్యం నశించింది.

ప్రకాశంగారు - ఈ ప్రత్యేక ఖద్దరు కేంద్రాలను ఏర్పాటు చేసిన సమయాలలో, మిల్లుబట్ట నశించాలని చేసిన ఏర్పాట్లను సమర్థిస్తూ గాంధీగారు ఇలా అన్నారు: "మరకదుళ్ళు - ప్రకాశంగారు తిరస్కరించక తప్పదు. ముల్లుబట్టల నిషేధం తప్పదు. ఈ పని చేస్తేనే, ఏదో క్రొత్త ఉద్యమం వడుస్తున్నట్టు ప్రజలు గ్రహించ గలరు."

అయితే, తర్వాత వచ్చిన ప్రభుత్వంవారు - గాంధీజీ సమర్థించి, ప్రకాశంగారు నడిపించిన కార్యక్రమాన్ని, తాము 'గాంధేయులు' అయినప్పటికీ రద్దు చేశారు. అందుచేతనే ఈ ఖాదీ ఉద్యమం కుంటుపడింది.

అందరూ ఖాదీకట్టి, బట్టల విషయంలో ఆ గ్రామాలు స్వయంపోషకంగా వుండాలనే ఆశయం కాగితాలమీద మాత్రం రద్దు పరచకుండా వుంచారు.

చవకగా రాట్నాలు, దూది మొదలైనవి వారికిచ్చేవారు. వారు వడికిన నూలు మొట్టమొదట ప్రభుత్వంవారే కొనుక్కుని. దాంతో బట్టలు నేయించి, ఆ బట్టలు గ్రామస్థులకు అమ్మడానికి ఏర్పాటు చేశారు.

ఆ స్కీముక్రింద విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు కలిపి తుని కేంద్రం, గుంటూరుజిల్లాలో కొన్నిగ్రామాలు కలిపి సంతనూతలపాడు కేంద్రం, ఇలాగే మరికొన్ని గ్రామాలు చేర్చి, ఎఱ్ఱగొండపాలెం, కోయిలకుంట్ల కేంద్రాలు - మొత్తంపైన నాలుగు కేంద్రాలు నడుస్తూండేవి.

ఆంధ్రప్రభుత్వం మళ్ళీ ఏర్పడడంవల్ల ఈ కేంద్రాలలో చురుగ్గా ఖద్దరు ఉత్పత్తి, గ్రామాలలో ఖద్దరు ధారణ తిరిగి హెచ్చాయి.

నూలు వడికేవారికీ, నేసేవారికీ కూలీకూడా కొంత పెంచడమయింది. ఖద్దరు విస్తృతపర్చడంకోసమని, ఈ కేంద్రాలలోనే గాక, అనేక కేంద్రాలలో - రాట్నాలు, దూది చవక ధరలకు ఇవ్వడం జరిగింది.