పుట:Naajeevitayatrat021599mbp.pdf/870

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పక్షంలో వున్న నలుగురు ఎదురుతిరిగి ఆ తీర్మానానికి అనుకూలంగా వోటు చేయడము, తన్మూలంగా చకచక ముందుకు నడుస్తూన్న ప్రకాశం ప్రభుత్వం పడిపోవడము - చరిత్రాత్మక విషయాలు. అవన్నీ తర్వాత వ్రాస్తాను.

ఈ ఇబ్బందులకుతోడు, ఆంధ్రరాష్ట్రం - మొదటి పంచవర్ష ప్రణాళిక సగం జరుగుతూండగా స్థాపించబడడంవల్ల, ఆంధ్రప్రభుత్వం తన అభిప్రాయాలనుబట్టి తయారుచేసుకొన్న ప్రణాళిక లేదు. ఉమ్మడి రాష్ట్రంలోంచి విడిపోయిన భాగాల జనాభానుబట్టి కేటాయింపులన్నీ విభజించడం జరిగింది. క్రొత్తరాష్ట్రం కదా అనే కరుణచేత, ఈ కేటాయింపులకు అదనంగా, 3 కోట్ల 84 లక్షల రూపాయలు మొత్తంగా ఇచ్చారు.

ఆ రోజులలో ఆరంభదశలో వున్న సమాజ వికాస కేంద్ర ఉద్యమాన్ని తొందరగా విస్తృతపరచడం జరిగింది.

ఇంతేకాకా, రెండవ పంచవర్ష ప్రణాళికకు అంచనా తయారు చేయడానికి ప్రభుత్వం చురుగ్గా యత్నాలు జరిపింది. ఉద్యోగ అవకాశాలు పెంచడానికి, వ్యవసాయ విస్తృతికి అవసరమైన నీటిపారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి గట్టి ఆలోచనలు ఆరంభింప బడ్డాయి.

ఈ ప్రణాళికలను, ప్రజా ప్రణాళికలుగా మార్చడంకోసం ప్రభుత్వం గ్రామ ప్రణాళికా సంఘాలను, ప్రాంతీయ ప్రణాళికా సంఘాలను ఏర్పాటు చేసింది. హరిజన, గిరిజన సంక్షేమం కోసం పెద్ద యత్నాలు చేసింది.

మహిళాభ్యుదయ ఉద్యమం విస్తృతం చేయడంకోసమని, మహిళా ఉద్యమ సంక్షేమ ఉద్యోగిని ప్రత్యేకంగా నియమించింది.

ఖాదీ అభివృద్ధి

1946 లో, ప్రకాశంగారు ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తయారుచేసిన ఖాదీ స్కీములు ఆ మధ్యకాలంలో పూర్తిగా