పుట:Naajeevitayatrat021599mbp.pdf/869

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పట్నం, తూర్పు - పశ్చిమ గోదావరులు, నెల్లూరు, అనంతపురం జిల్లాలలో వరదలు వచ్చి అపార నష్టం కలగజేయడంవల్ల, అనుకోకుండానే అందుకు 4 కోట్ల 60 లక్షలకు పైగా అవాంతరపు ఖర్చు వచ్చిపడింది.

భూమిసంస్కరణ ఆలోచనకి వచ్చి, ఆ విషయమై 1954 ఆగస్టులో డాక్టర్ లక్నోగారి అధ్యక్షతన ఒక లాండ్ రిఫార్మ్ కమిటీని నియమించడం జరిగింది. అయితే, ఇప్పుడు వున్న 'సీలీంగు' అనే భావాలు, ఆనాడు విస్ఫుటంగా లేవు. కాని, అందులో - కమతం ప్రమాణం ఎంత ఉండాలి? ప్రమాణానికి మించివున్న భూమిని ఏ విధంగా పంపకం చేయాలి? అన్న సూచనలుమాత్రం వ్రాయబడి వున్నాయి.

తుంగభద్రా నీటిపారుదల ప్రాజెక్టు క్రింద, తొందరగా సాగు విస్తరణ చేయడానికి ప్రభుత్వం చురుకైన ఏర్పాట్లు చేయడం ఆరంభించింది. ఇంతేకాక, ఆ ప్రాంతాలలోవున్న భూములలో ఎత్తుపల్లాలు తగ్గించి, సమతలంగా చేయించడానికిగూడా ప్రభుత్వం యత్నించ నారంభించింది.

మద్యనిషేధం ఉండవలెనా - వద్దా? అనే ప్రశ్న ఆ రోజులలో సభ్యులను చాలా బాధించింది. ఇదివరకేదో సందర్భంలో, ఎప్పుడో ఒకప్పుడు మద్యనిషేధ శాసనం రద్దుచేయాలని చెప్పినవారి సంఖ్య శాసన సభలో హెచ్చుగా వుంది. అయితే, ప్రభుత్వవర్గంలో వున్న పార్టీలలో - కాంగ్రెసు పెద్ద పార్టీ. వారికి శాసనం రద్దు చేయడంలో ఏకాభిప్రాయం లేదు. అందుచేత, ఏమి చేయడానికీ తోచని సందేహస్థితిలో శొంఠి రామమూర్తిగారి అధ్యక్షతను ఈ మద్యనిషేధ శాసన పరిపాలన ఏ విధంగా చక్కదిద్దాలో సూచించడానికి, ఒక ఉప సంఘం ఏర్పాటయింది.

"సంశయాత్మా వినశ్యతి!" చివరికి ఈ సంఘం నివేదికలో గల సిఫారసులు అమలు చేయలేదన్న కారణం చూపెట్టి, ప్రతిపక్షం వారు ప్రభుత్వంపైన విశ్వాసరాహిత్య తీర్మానం తేవడము, ప్రభుత్వ