పుట:Naajeevitayatrat021599mbp.pdf/854

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశాఖపట్నం జిల్లానుంచి వచ్చిన వారే ఒకరిద్దరు గుంటూరు అన్న సవరణకు కూడా ఒప్పుకున్నారు. వోటింగులో గుంటూరుకు అనుకూలంగా 67 వోట్లు, ప్రతికూలంగా 66 వోట్లు రావడంచేత, గుంటూరు అనే మాటతో తీర్మానం పాసయింది.

మళ్ళీ నరసింహారావుగారు, తాత్కాలికం అన్నమాట తీసివేయాలని సవరణ చేయడానికి ప్రయత్నించి విఫలు లై నారు.

తీర్మానం పాసు కాగానే నేను ప్రతిపాదించిన విశాఖపట్నం పేరు వీగిపోవడంచేత, నేను రాజీనామా ఇస్తానా అని ఒక రిద్దరు ప్రతి పక్షులు ప్రశ్నించారు.

నేను ఈ తీర్మానంలో ప్రధానమైన అంశం ఆంధ్ర రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయడమనీ, అది సభవారు అంగీకరించారనీ, కేంద్రం అన్నది తాత్కాలికం గనుక అప్రధానమనీ చెప్పి, నేను రాజీనామా యివ్వక పోవడమేగాకుండా, గుంటూరులో హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన 8 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని వెంటనే వెల్లడించాను.

అయితే - ప్రకాశంగారూ, నేనూ అనుకోనటువంటి కొన్ని భేదాభిప్రాయాలు మంత్రి మండలిలో కొందరినీ, సచివాలయంలో కొందరినీ బాధించినవి.

ఆ రోజునుంచి, మిగిలిన విభజన కార్యక్రమం నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం వా రొక ప్రత్యేక ఉద్యోగిని, ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అటువంటి ప్రత్యేకోద్యోగి ఆ హైకోర్టు స్థాపించిన తరువాత ప్రధాన న్యాయమూర్తిగా నియుక్తుడయే అవకాశ మున్నది.

ఆంధ్రా హైకోర్టుకు వచ్చే తెలుగు జడ్జీలలో అందరికన్నా సీనియరయిన వారిపైన సచివాలయంలో ఎవరి మూలంగానో ఏ తత్వాన్ని అనుసరించో ఒక ప్రతికూలత పుట్టింది. అది నేను కానీ, ప్రకాశంగారుకానీ గ్రహించలేక పోయాము.

హైకోర్టు ప్రత్యేకంగా స్థాపించాలన్న తీర్మానం కాబినెట్ మంత్రులందరూ ఏకగ్రీవంగా ఒప్పుకొన్నది కావడంచేత సచివా