పుట:Naajeevitayatrat021599mbp.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సినవారే! ఆయన పరిపాలనలో కూడా చాలా హుందాతనం చూపించారు. ఆనాటి పార్టీ కక్ష లెంత తీవ్రంగా వెళ్ళా యంటే-ప్రతికక్షులు చివరకి దుర్గయ్యగారి మీద కూడా అక్రమమైన ఆరోపణలు చేసేవారు చివరికి దుర్గయ్యగారు నాకు ప్రతికక్షిగా పనిచేసినా ఆయన ధైర్యమూ, సమర్థతా మొదలయిన సుగుణాలు చూస్తే నాకు ఆయనయందు అభిమానం ఉండేది.

నేను 1898లో కాబోలు మండవిల్లి సుబ్బారావుగారిమీద పోటీచేసి ఓడిపోయాను. అప్పుడు ఛైర్మన్ పదవి పలుకుబడి అంతా వినియోగించి, వోటర్లని తిప్పివేసి నా ఎన్నికకి భంగం కలిగించారు కనక, ఎన్నిక రద్దు చెయ్యవలసిందని సబ్ కలెక్టరుకి పిటీషన్ పెట్టాను. దాని మీద సబ్ కలెక్టరు దుర్గయ్యగారికి నోటీసు పంపించి, కోర్టుకి రప్పించి, కుర్చీమీద కుర్చోబెట్టాడు. అప్పుడు నేను ఆ సబ్ కలెక్టరుతో "ఏమండీ! నేను ఆ పెద్దమనిషి మీద నేరం ఆరోపిస్తే, మీరు ఆయనకి కుర్చో ఇచ్చి కూర్చోబెట్టి, నన్ను దోషారోపణ చెయ్యమనడం ఏమి సబబుగా ఉంది?" అని అడిగాను. అందుమీద సబ్ కలెక్టరు దుర్గయ్యగారికేసి చూసి, "దీనికి మీరు ఏమంటారు?" అన్నాడు. ఆపైన దుర్గయ్యగారు నిర్భయంగా "నేను కాన్వాసు చేసినమాట నిజమే! ఆ పెద్దమనిషి కౌన్సిల్లోకి రావటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో, రాకుండా చెయ్యడానికి వోటర్ని అయిన నాకూ అంత హక్కుంది," అని వాదించారు. నేను ప్రతివాదన చెప్పినా, ఆయన చెప్పిన సాహసపద్ధతికి చాలా సంతోషించాను.

సబ్ కలెక్టరు ఏమీ కలగజేసుకోలేదు. ఆఖరికి నన్ను 1899లో నాలుగవవార్డులో కౌన్సిలరుగా ఎన్నుకున్నారు. దుర్గయ్యగారిని తప్పించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చిన సుబ్బారావుపంతులుగారు కూడా కొంచెం సంతోషించారు. నేను కౌన్సిలర్ని అయినప్పటినించీ ప్రతి సంవత్సరమూ వచ్చిన బై ఎలక్షన్లలో పోటీలు పెట్టి దుర్గయ్యగారి మనుష్యులన్ని ఓడించాను. క్రమంగా రెండేళ్ళలో దుర్గయ్యగారి పార్టీమనుష్యుల్ని అందర్నీ