పుట:Naajeevitayatrat021599mbp.pdf/847

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్య ఇంజనీరుగా ఉన్న వేపా కృష్ణమూర్తిగారు, మరి కొందరు సిబ్బందితో - ఇసుకతో నింపిన బస్తాలతోను, నావలతోను, గండిపడినచోట అడ్డువేయడానికి యత్నించారు. ఆ యత్నంలోనే ఆయన, మరి ఇద్దరు చిన్న ఉద్యోగులు, కొందరు కళాసీలు - నదీవేగానికి ఆగలేక ప్రాణాలర్పించి, ఆంధ్రుల నందరినీ కన్నీటముంచిన దుస్సంఘటన సంభవించింది.

పాత అనకట్ట పనికిరాదనీ, క్రొత్త బారేజ్ (ఇప్పుడు ఉన్నదే) నిర్మాణం కావాలని, ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు ఇచ్చిన సలహాపైని బారేజ్ నిర్మాణానికి రాతకోతలు జరిగాయి. కాని, పనికి శాంక్షను రాలేదు.

ఆంధ్రులకున్న తొందర, చెన్నరాష్ట్ర ప్రభుత్వానికి లేక పోయింది. అటువంటి దుస్థ్సితిలో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.

ఉత్తరాలతో, తంతివార్తలతో పనికాకపోవడం చేత, నేను ప్రకాశంగారి నడిగి డిల్లీ వెళ్ళాను. అక్కడ నెహ్రూగారిని సందర్శించగా, నన్ను ఆయన ప్లానింగ్ కమీషన్ వైస్ ప్రెసిడెంటు అయిన వి.టి. కృష్ణమాచారిగారిని చూడమన్నారు. ఆ కృష్ణమాచారిగారంటే నెహ్రూగారికి చాలా విశ్వాసము. ఆయన బ్రిటిషు గవర్నమెంటుకాలంలో బిరుదులు సంపాదించిన వ్యక్తి. 1937 లో కాంగ్రెసువారు గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేస్తా రనేవి తథ్యమయినపుడు, బ్రిటిషు గవర్నమెంటులోని పెద్ద ఉద్యోగులతో తాను కాంగ్రెసువారి క్రింద పనిచేయలేనని చెప్పి, కొంచెం ముందుగానే ఒక స్వదేశ సంస్థానానికి దివానుగా వెళ్ళిపోయారు. అక్కడినుంచి యుద్ధకాలంలో మెట్టుపై మెట్టుగా ఎక్కి, యుద్ధానంతరం బ్రిటిష్‌వారికి అనువైన యుద్ధానంతర పునర్మిరర్మాన కార్యక్రమం (Post-war Re-contruction scheme), పెద్ద ఉద్యోగముల పునర్వ్యవస్థీకరణ (Services reform) గురించి నివేదికలు వ్రాయడం, మొదలయిన పనులు చేయడంలో, భాగం వహించి భారతదేశ స్వాతంత్ర్య ప్రాప్తినాటికి ప్రభుత్వదృష్టిలో ఉన్నతుడుగా ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్లానింగ్ కమీష