పుట:Naajeevitayatrat021599mbp.pdf/839

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భణ శాసన సభా సంప్రదాయ బద్దులమైన మా వంటివారికి కొంత కష్టంగానే ఉండేది.

1954 లో స్థానిక సంస్థల శాసనాలను సవరించడానికిగాను, ప్రభుత్వ పక్షాన స్థానిక సంస్థల మంత్రి అయిన తిమ్మారెడ్డిగారు [1] ప్రతిపాదించారు.

అయితే, అదే సమయంలో, ఈ స్థానిక సంస్థల బిల్లు వెంటనే ప్రవేశపెట్టలేదని ప్రతిపక్షంవారు అభిశంసన పూర్వకంగా ప్రతిపాదన ఒకటి చేశారు.

తిమ్మారెడ్డిగారు బిల్లుకు నోటీసు ఇచ్చి ఉండడంచేత, వారి ప్రతిపాదనకు తావులేదు. ఆ విధంగానే పాపం, స్పీకరుగారు రూలింగుకూడా ఇచ్చారు.

అయితే నేమి? ప్రతిపక్షులకు సంఖ్యాబలం హెచ్చుగా ఉంది కదా! శాసన సభలో జ్ఞానమంతా సంఖ్యాబలంతో పరిసమాప్తి చెందుతుంది. అందుచేత, ప్రతిపక్షంవారు బాగా జోరుగా మాట్లాడుతూంటే, ప్రకాశంగా రీ విధంగా అన్నారు:

"అధ్యక్షా! నిన్న సభ వాయిదా వేస్తూ, సభ్యులంతా అలిసి పోయారని మీ రన్నారు. కాని, ఇక్కడ కూర్చున్న మాలో ఎవ్వరూ అలిసిపోలేదు. అలిసిపోము. మనమంతా ఒక మహాకార్య నిర్మాణం మధ్య ఉన్నాము. మనము ఎంత సృజనాత్మకమైన కార్యము చేస్తున్నామో అందరూ గ్రహించినట్టు కనిపిం

  1. ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో ఏర్పాటయినదని వెనుక వ్రాశాను. తర్వాత - తిమ్మారెడ్డిగారు, సంజీవయ్యగారు, కోటిరెడ్డిగారు, పట్టాభిరామారావు గారలను త్వరలోనే మంత్రి మండలిలోకి తీసుకొని దాన్ని విస్తృత పరచడమైంది. మొదట నిరాకరించినా, తర్వాత చేరడానికి అంగీకరించి, గౌతులచ్చన్న గారు కూడా మంత్రి అయ్యారు. అయితే, మరికొంత కాలానికే ఏదో భేదాభిప్రాయం కలిగి ఆయన రాజీనామా యిచ్చి వెళ్ళిపోయారు.
    మిగిలిన వాళ్ళము ప్రభుత్వ పతనంవరకు కలిసి ఉంటిమి.