పుట:Naajeevitayatrat021599mbp.pdf/837

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయితే, చర్చ మామూలు విధాన్నే ప్రతిపక్షంవారు అనుకున్న అప్రస్తుత పద్ధతిలోనే సాగింది. అయినప్పటికీ 28-11-1953 నాడు ఆ తీర్మానము బహుమతముగా ఆమోదమయింది.

కానీ, ఒకటిమాత్రం స్పష్టంగా తేలింది. అదేమిటంటే - ప్రభుత్వం సాఫీగా నడవడానికీ, శాశ్వత సత్కార్యక్రమంలో ముందంజ వేయడానికీ మనశ్శాంతిలేని ప్రభుత్వాధిపతిగా ప్రకాశంగారు నడుచుకోవలసి వచ్చింది. అంతకుముందు రెండు నెలలక్రింద జ్యోతిష్కులు చెప్పిన బాధలు ప్రారంభమయినాయి. అయితే, ప్రభుత్వ పక్షాన ఉన్న 67, 68 మందీ సభ్యులూ చివర విశ్వాస రాహిత్య తీర్మానం వచ్చేవరకు ప్రభుత్వపక్షాన్ని బలపరుస్తూనే వచ్చారు.

30-11-1953 న ప్రతిపక్షులు తిరిగి ఈ రాజధాని ప్రశ్న లేవదీశారు. ఈ రోజున స్పీకరు వెంకట్రామయ్యగారు పరస్పరమూ ప్రతికూలములయిన రెండు, మూడు రూలింగు లివ్వడం తటస్థించింది.

దాంతో, ఉపముఖ్యమంత్రి సంజీవరెడ్డిగారికి చీకాకు వేసి, "అధ్యక్షస్థానం ఎడల నాకేమీ అగౌరవములేదుగానీ, పరస్పర ప్రతికూలమైన రూలింగుల బాధ పడలేను" అని చెప్పి పైకి వెళ్ళిపోయారు.

వెంకట్రామయ్యగారు ఆ విధంగా ఒక నిర్ణయానికి రాలేని మనిషి అని ఆయనను అధ్యక్ష పదవికి ప్రతిపాదించినపుడు తెలుసుకోలేక పోయాము. అసలే ప్రభుత్వం పెద్ద మెజారిటీ లేని స్థితిలో ఉంది. దానికితోడు అసందిగ్ధమైన నిర్ణయాలతో తీర్పు చెప్పలేని సభాధ్యక్షుడు కూడా ఉన్నట్టయితే, ఆ ప్రభుత్వం దుస్థితి యిక వేరే చెప్పాలా?

ఆ రోజూ సభ వాయిదా వేసిన తర్వాత, ప్రకాశంగారు సభలోంచి మెల్లిగా బయటకు వస్తున్నారు. ఆయన వస్తూన్న వరండా అట్టే వెడల్పులేదు. అంతట్లో 'స్పీకరుగారు వస్తున్నారు, స్పీకరుగారు వస్తున్నారు" అని డఫేదారు అంటున్న మాటలు ప్రకాశంగారు విన్నారు. ప్రకాశంగారిని చూసి, స్పీకరు కొంచెం వెనక్కు తగ్గి మెల్లిగా అడుగులు వేశాడు.

ప్రకాశంగారు వెనక్కు చూడకుండానే, నవ్వుతూ, "ఏమయ్యా