పుట:Naajeevitayatrat021599mbp.pdf/835

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అది అయినతర్వాత, పైనచెప్పిన నల్లపాటి వెంకట్రామయ్యగారు స్పీకరుగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షంవారు ఊరుకోక ఒక అభ్యర్థిని పోటీబెట్టారు. వారి అభ్యర్థికి 48 వోట్లు, వెంకట్రామయ్యగారికి 86 వోట్లు వచ్చాయి. వెంకట్రామయ్యగారు గెలిచారు.

ప్రకాశంగారు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ పక్షపాతం లేకుండా స్పీకరు ఉద్యోగాన్ని నిర్వహించగలరని ఆశిస్తూ ఆశీర్వదించారు.

ఆ సమయంలో ప్రకాశంగారు మరొకమాటకూడా అన్నారు:

"అనేకమైన కష్టనష్టాల కోర్చి ప్రత్యే కాంధ్రరాష్ట్రము నిర్మించుకోగలిగాము. ఈ నిర్మాణ కార్యక్రమంలో నేనుకూడా కొంత భాగస్వామినై ఉన్నందుకు, నాకు అత్యంతమైన సంతృప్తి కలుగుతున్నది. మనలో మనకు భేదాభిప్రాయాలు ఎన్నో ఉన్నా, వాటిని సర్దుబాటు చేసుకొని, కలిసి ఈ రాష్ట్రం ఏర్పాటు చేసుకొన్నాము."

ఈ విధంగా మాట్లాడి, ఇదే ప్రకారంగా కలిసి మెలిసి పని చేసుకుంటూ వస్తే, ఆంధ్రరాష్ట్రం ముందడుగు వేయగలదని ఆశించారు.

దీర్ఘోపన్యాసమేమీ చేయలేదు.

గవర్నరు శాసన సభ్యులను సంబోదిస్తూ చేసిన ఉపన్యాసానికి, శాసన సభ్యుల కృతజ్ఞతను తెలియపరిచే తీర్మానం ప్రభుత్వపక్షాన ఉన్న శాసన సభ్యులలో ఒకరు 1953 నవంబరు 26 న ప్రతిపాదించారు.

తీర్మాన ప్రతిపాదన కాగానే, ప్రకాశంగారు శాసన సభ్యులకు ఒక విషయం చెప్పడానికి లేచి, ఇలా చెప్పారు.

"మన రాష్ట్రగవర్నరు సి. ఎం. త్రివేదిగారు తమకు రావలసిన జీతంలోంచి 1,200 రూపాయలు స్వచ్చందంగా వదులుకున్నారు. మాటలు పది చెప్పినా, డబ్బు విషయంలో చాలా మందికి చేయి సంకుచితమైపోతుంది. కాని, వీరు ఔదార్యంతో ఇంత వేతనము వదలుకోవడం చాలా ప్రశంసనీయ