పుట:Naajeevitayatrat021599mbp.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రీ లోలత్వం వుండేది. కాని ప్రజల సొమ్ము స్వవినియోగం చేసుకునే మనిషి మాత్రం కాడు. కాని చాలాకాలానికి సుబ్బారావుపంతులు ప్రభృతులు ఆయనమీద ఎత్తిన దండయాత్రలకి లొంగిపోయాడు. సుబ్బారావుపంతులు ప్రభృతులకి వీరేశలింగం పంతులుగారు, ఆయన వివేకవర్ధనీ పత్రిక కూడా తోడయ్యాయి. ఏలూరి లక్ష్మీనరసింహంగారి మీద ఆ పత్రికలో వ్యంగ్యంగా అనేక చిత్రమైన కథలు వ్రాసేవారు. దానిమీద లక్ష్మీనరసింహంగారు, పరువునష్టం దావా వేశారు. ఆ దావాలో జస్టిఫికేషన్ ప్లీ పెట్టి లక్ష్మీనరసింహంగారిని అనేక సాక్ష్యాలతోటీ, సంపన్నాలతోటీ బాగా అల్లరి పెట్టారు. అందుచేత ఆయన నిస్పృహ చెంది ఈ రాజకీయాల్లో నిడమర్తి దుర్గయ్య గారిని తన స్థానే ప్రవేశ పెట్టారు.

దుర్గయ్యగారు చాలాకాలం ఛైర్మన్ గా వున్నారు. ఈ మునిసిపల్ వ్యవహారాల్లో రాయపూడి సుబ్బారాయుడు అనే వైశ్యప్రముఖుడు ఒకాయన చాలా ఎన్నికలో వాడు. ఆయన ఆట్టే చదువుకున్నవాడు కాడు. కాని, మునిసిపల్ వ్యవహారాల్లో అందెవేసిన చెయ్యి. ఎవరు మునిసిపల్ కౌన్సిలర్ కావాలన్నా, ఛైర్మన్ కావాలన్నా ఆయన సహాయం లేకపోతే అది అసంభవమే! ఆయన చాలా ప్రతిభావంతుడనే చెప్పాలి. దుర్గయ్యగారు ఆయన సహాయంతోనే చాలాకాలం ఛైర్మన్ చేశారు. ఏలూరి లక్ష్మీనరసింహంగారు కూడా దుర్గయ్య గారికి అండగా నిలిచి పనిచేశారు. సుబ్బారావు పంతులుగారు, నేతి సోమయాజులుగారు మొదలయినవారు కౌన్సిల్లోకి రావడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు కాని, జయించలేకపోయారు. చివరికి ప్రభుత్వపు ప్రాపంకం వల్ల సోమయాజులు, సుబ్బారావు పంతులుగార్లు నామినేటెడ్ సభ్యులుగా ప్రవేశించారు. కాని, దుర్గయ్యగారికి వుండిన మెజారిటీ వల్ల వాళ్ళమాట సాగేది కాదు. వాళ్ళు చివరికి విసిగి వేసారి రాజీనామాలు ఇచ్చివేశారు.

ఈ వ్యవహారాలలో రాయపూడి సుబ్బారాయుడు బొమ్మల్ని ఎక్కించి దింపించేంత ప్రతిభాశాలి అని వ్రాశాను. అతనికి మునసబు