పుట:Naajeevitayatrat021599mbp.pdf/818

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీ ముసలివానితో వేగడం చాలా కష్టము. ఆయన ఈ రోజున వస్తాడని నా ఇతర కార్యక్రమాలన్నీ రెండు గంటలు వాయిదా వేసుకొన్నాను. ఆయన వచ్చాడు కాడు. చూశావా ఆయన వైఖరి?" అన్నారు.

అందుకు సంజీవరెడ్డిగారు, "అదేమిఅలాగు అంటారు? ఆయన మిమ్మల్ని పదకొండు గంటలకు కలుసుకోవడానికి, వచ్చి సిద్ధంగానే ఉన్నారు. ఆయన యిక్కడికి వస్తున్నట్టు మీ పేర తంతివార్తకూడా యిచ్చారు," అన్నారు.

నెహ్రూగారు "నాకు ఏ తంతివార్తా అందలేదు," అన్నారు. అందుకు "ఆ తంతివార్త యిచ్చినప్పుడు నేను వారి దగ్గర ఉన్నాను. అందకపోవడం ఏలాగు జరిగింది?" అని ప్రశ్నించారు రెడ్డిగారు.

నెహ్రూగారు తమ పెర్సనల్ అసిస్టెంటును వెంటనే పిలిచి, "ప్రకాశంగారి దగ్గరనుంచి తంతివార్త వచ్చిందా?" అని ప్రశ్నిస్తే, ఆయన "వచ్చింది," అన్నాడు.

"ఎప్పుడు?" అని నెహ్రూగారు మళ్ళీ అడిగారు. "మొన్న" అని ఆయన జవాబిచ్చాడు. అది విని, "సరే వెళ్లు," అన్నారు నెహ్రూగారు.

తనకు తంతివార్త ఎందుకు చూపించలేదని నెహ్రూగారు ఆయనను అడగనైనా అడగలేదు.

అవి, బహుశ: ఢిల్లీ నగర సచివాలయ మర్యాదలు కాబోలు!

సంజీవరెడ్డిగారు వెంటనే కాన్ట్సిట్యూషన్ హౌసుకు వచ్చి, అక్కడ జరిగిందంతా మాకు చెప్పారు.

ఏర్పాటు చేసిన ప్రకారం ప్రకాశంగారు, సంజీవరెడ్డిగారు, నెహ్రూగారు కలుసుకొన్నారు. ఒక గంటసేపు చర్చించిన ఫలితంగా విభజన కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి ఒక ఉప సంఘాన్ని నియమించడానికి అంగీకరించారు. లెక్కలు వగైరాల విషయమై, పూర్వము విభజన సంఘము చేసిన ఏర్పాట్లు ఆధారంగా తీసుకొని కచేరీల విభజన, ఉద్యోగస్థుల పంపకము, క్రొత్త రాష్ట్రంలో