పుట:Naajeevitayatrat021599mbp.pdf/815

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశ్ నారాయణ్‌గారల యాజమాన్యాన నడిచే 'సోషలిస్ట్ పార్టీ' - కృపలానీ, ప్రకాశంగారల నాయకత్వాన నడిచే 'కిసాన్ మజుదూర్‌ పార్టీ' లో విలీనం కావడానికి బొంబాయిలో సంయుక్త సహాసభ ఒకటి ఏర్పరచి, అక్కడ తీర్మానించినట్టు రెండు పార్టీలను కలిపి "ప్రజా సోషలిస్టు పార్టీ" అదే క్రొత్తపార్టీని రూపొందించారు.

ఈ మార్పు ఆంధ్రప్రాంతానికి సంబంధించినంత మటుకు అనర్థదాయకంగా పరిణమించింది. చివరికి, ఈ సోషలిస్టులలో వేళ్ళ మీద లెక్క పెట్టదగినంతమంది తప్ప, తక్కిన వారందరు కాంగ్రెసులో చేరిపోయారు. పై రాష్ట్రాలలో కూడా వీరిలో చాలామంది ప్రత్యేకంగా సోషలిస్టు పార్టీగా విడిపోయారు. ఆ విడిపోయినవారూ ఇప్పుడు మళ్ళీ రెండు భాగా లవుతున్నారు.

అది అలా ఉంచి, 1952 లో ఆంధ్రలో జరిగిన విషయము చూద్దాము. ప్రకాశంగారు, వారి అనుయాయులమైన మేము - ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచినపుడు, బళ్ళారిజిల్లాలో హెచ్చు భాగాన్ని, మైసూరు ప్రాంతాలలోని తెలుగు భాగాలను, చెన్నపట్నం అంతా, లేకపోతే ఉత్తరభాగం ఆంధ్రరాష్ట్రంలో కలిపిఉంచాలని అప్పటికి ముఫ్పైసంవత్సరాలనుంచి అనుకుంటూ ఉండేవాళ్ళము. అయితే, ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఏర్పాట్లు జరిగే సమయంలో మాతో విలీనమైన సోషలిస్టులు - బళ్ళారి, చెన్నపట్నం ఆంధ్రలో చేరకపోతేనేమి అని వాదించి, పత్రికలలో కూడా వ్రాసేవారు. అందుచేత, పార్టీలో వారికి మాకు కొంత భేదదృష్టి ప్రతీకార్యములోను కనిపించేది.

వారి యీ అభిప్రాయానికి కారణమేమని వారినే అడగగా, వారు - తాము సోషలిస్టుపార్టీగా ఉండేరోజులలో బళ్ళారి అంతా కన్నడిగులకు చెందినదని, చెన్నపట్నంమంతా తమిళులకు చెందినదని తీర్మానం వ్రాసుకొని ఒప్పుకొన్నాము అని బయటపెట్టారు.

ఇంతేకాక, కాంగ్రెసు పార్టీ వారు (ఇది 1952 నాటి విషయమని పాఠకులు జ్ఞాపకముంచుకోవలెను.) ప్రజాభ్యుదయకరమైన త్రోవపట్టారు గనుక, కాంగ్రెసులో కలిసిపోవడమో, లేక వారితో చేయి కల