పుట:Naajeevitayatrat021599mbp.pdf/811

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"అటువంటప్పుడు, మీరు కూచోబెట్టినంత మాత్రాన ఆయన ముఖ్యమంత్రి కానేరడు. ఆయన ఏర్పాటుచేసిన మంత్రివర్గం సంవిధాన బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కానేరదు. ఆయన కేవలం అక్రమ ఆక్రమణదారుడు. ఆయన సలహాపై మీరు పిలిచిన ఈ శాసన సభా సమావేశం క్రమ బద్దం కాదు. క్రమ బద్ధంగా మా యునైటెడ్ ఫ్రంటు నాయకుని ఆహ్వానించి, ప్రభుత్వం ఏర్పాటు చేయించేంతవరకు ప్రజాప్రతినిధులమైన మేము ఈ అక్రమ సంబోదనా కార్యక్రమంలో మెజారిటీలో ఉండి పాల్గొన జాలము. అందుచేత, మా ప్రతికూలతను తెలియజేయడానికి మేమంతా ఈ సభలోనుంచి బయటకు వెళ్ళిపోతున్నాము."

ఇలా చెప్పి ఆయన బయటకు నడవ నారంభించేసరికి, తక్కిన యునైటెడ్ ఫ్రంటు సభ్యులందరూ ఆయన వెంట శాంతంగా బయటికి వచ్చేశారు.

అలా సగంపైగా స్థలాలన్నీ ఖాళీ అయేసరికి, ఆదిలోనే 'నాగవల్లి మరునాడున్న పెళ్ళి ఇల్లు' మోస్తరుగా సభ వెలవెల బోయింది.

ప్రకాశంగారు మాట్లాడుతున్నప్పుడు గవర్నరుగారు నిశ్చేష్టులై వినడం తప్ప మరేమీ చేయలేకపోయారు.

మేమంతా లేచి వచ్చేసిన తర్వాత, ఆయన తన ఉపన్యాసంలో నాలుగు ముక్కలు చదివేసి, సభ ముగించుకొని వెళ్ళిపోయారట.

అమరజీవి పొట్టి శ్రీరాములు

1913 లో బాపట్లోలో ప్రథమ ఆంధ్ర మహాసభ జరిగింది. 1917 లో ఆంధ్ర ప్రాంతాలకు ప్రత్యేకంగా రాష్ట్ర కాంగ్రెసు సంఘం ఏర్పాటయింది. 1939 లో కాంగ్రెసు వర్కింగ్ కమిటీ - దేశానికి స్వాతంత్ర్య వచ్చిన తర్వాత కాంగ్రెసు పనికై ఏర్పడిన రాష్ట్రాలను భాషా రాష్ట్రాలుగా సంవిధానంలో ఏర్పాటు చేయడానికి తీర్మానించింది.

1948 లో వ్రాసిన సంవిధానం మొదటి ముసాయిదాలో ఆంధ్ర రాష్ట్రం చేర్చబడింది. రెండవ ముసాయిదాలో అది తీసివేయబడింది