పుట:Naajeevitayatrat021599mbp.pdf/810

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంటనే, ప్రకాశంగారు ప్రతిపక్ష నాయక స్థానంలో నిలబడి, గవర్నరును సంబోధిస్తూ -

"గవర్నరుగారూ! ఒక వ్యవస్థా విషయము (పాయింట్ ఆఫ్ ఆర్డర్) చెప్పడానికి నిలుచున్నాను."

అనేసరికి, గవర్నరు శ్రీప్రకాశగారు తటాలున తమ కుర్చీలో కూచున్నారు.

ఈ విధంగా, గవర్నరు (రాజ్యపాలుడు) ఉభయ శాసన సభా సభ్యులను సంబోదించే సమయంలో, పాయింట్ ఆఫ్ ఆర్డరు లేవదీయడమన్నది ఏ రాష్ట్రంలోనూ జరగలేదు.

గవర్నరుకు చెరొక ప్రక్క కూచున్న శాసన సభ స్పీకరూ, శాసన మండలి అధ్యక్షుడు అది విని దిగ్భ్రాంతులయ్యారు.

ఆ దిగువ శాసన సభ కార్యదర్శి దేశంలో శాసన సభా కార్య విధాన నిపుణుడని పేరు పొందినవాడు. ఆయన, 'మే'దొరగారు వ్రాసిన 'పార్లమెంటరీ విధాన' మనే గ్రంథంలో పుటలు అటు ఇటు త్రిప్పి, తొందరగా పరిశీలించసాగాడు. అందులో ఇటువంటి విషయం ఉండదన్న విషయం వారు మరచిపోయారు.

ప్రకాశంగారు తన వ్యవస్థా విషయం వివరిస్తూ ఇలా చెప్పారు:

"మీరు సంవిధాన ప్రకారంగా నడిచే 'రాజ్యపాల్‌' అనగా, ప్రభుత్వం సలహాపైన నడుచుకొనే గవర్న రన్నమాట. అలా సలహా యివ్వడానికి ఒక ప్రభుత్వముండాలి. అది సంవిధాన క్రమబద్దమై ఏర్పడిన ప్రభుత్వమై ఉండాలి. మన సంవిధానపు నిజతత్వ ప్రకారం శాసన సభలో మెజారిటీ (బహుమతము) ఉన్న నాయకుని క్రింద ఏర్పాటయిన ప్రభుత్వమని దాని అర్థము. మీ కున్న లెక్కల ప్రకారమూ, నేను మీకు లోగడ మా యునైటెడ్ ఫ్రంటు పార్టీ తరపున మా 164 సభ్యుల సంతకాలతో అందజేసిన విజ్ఞప్తినల్లా, మీరు తీసుకువచ్చి ముఖ్యమంత్రిగా కూచోబెట్టిన రాజగోపాలాచారి గారికి బహుమతము లే దన్నమాట నిస్సందేహము.