పుట:Naajeevitayatrat021599mbp.pdf/802

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"అలా ఊరుకున్నట్టయితే, అధికారదుర్వినియోగం చేసినవారికి 'ప్రజలపై దండెత్తి దోచుకు తినండి,' అని చెప్పినట్టవుతుంది గదా!"

ఇటువంటి ప్రతిబంధకాలు పరిశీలించగా, కాంగ్రెసునుంచి విడిపోవడం మంచిదనే ఒక భావం బయటపడింది.

ఆంధ్రదేశంలో కాంగ్రెసును పెంచిన దెవరు?

ఆ పెంచిన ప్రకాశం, కాళేశ్వరరావు, రంగాగారలు మొదలయిన త్యాగశీలురు యావన్మందీ వారు నిర్మించిన ఇల్లు విడిచి పోవలసిందేనా? పోకుంటేగానీ పరిష్కారమార్గం లేదా?

కాని, వేరే పరిష్కారమార్గం కనిపించలేదు. అధిష్ఠాన వర్గానికి పట్టాభిగారు, రాజాజీల మూలంగా ప్రకాశంగారి వర్గం ప్రతికూలమయింది. అది నిస్సందేహము.

చివరికి, కాంగ్రెసుకు రాజీనామా యిచ్చివేయడమే ప్రజా రాజ్య సంరక్షణకు తరుణోపాయమనే నిశ్చయానికి వారంతా వచ్చేశారు.

అలా వచ్చినవెంటనే తెలుగుజిల్లాలలో ప్రకాశం, రంగాగారల వర్గాలవారందరూ కాంగ్రెసునుంచి విడిపోయారు. [1] తెలుగు జిల్లాల రాజకీయ స్వభావం ఆ క్షణంలో మారిపోయింది.

ప్రకాశంగారు, రంగాగారు వెంటనే 'ఆంధ్ర ప్రజాపార్టీ'ని క్రొత్తగా స్థాపించారు. ఈ పార్టీ తరపున ప్రతి జిల్లాలోను, ప్రతి ముఖ్యకేంద్రంలోను తక్షణ కార్యక్రమోపక్రమణానికై చురుకుగా ఎడ్‌హాక్ (తాత్కాలిక) సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు, కొందరు ఉప నాయకులు హ్రస్వదృష్టితో ప్రకాశం, రంగాల

  1. విశాఖపట్నంలో ఉన్న నాకు ప్రకాశంగారు, రంగాగారు కాంగ్రెసు సభ్యత్వానికి రాజీనామా యిచ్చారని తెలిసి, వెంటనే నేనుకూడా రాజీనామా చేశాను. అప్పుడు నేను కాంగ్రెసు టికెట్టుమీద శాసన సభ్యునిగా ఉన్నాను. అలాగునే మునిసిపల్ ఛేర్మన్ గాను ఉన్నాను. ఆ ఉత్తరక్షణంలో నేను ఆ రెండు పదవులకూకూడా రాజీనామా చేసేశాను.