పుట:Naajeevitayatrat021599mbp.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vi

తంగా ఆర్జిస్తూ ఉండేవారు. చిరకాలం మా నాయనగారు, ప్రకాశంగారూ ప్రక్క ప్రక్కనే ప్రవహిస్తూన్న రెండు నదుల్లాగ సారవంతమైన మన తెలుగు నేలను ఫలవంతం చేశారు. ఇద్దరూ ఇంచుమించు ఏకకాలంలో జన్మించారు. ఒకే కళాశాలలో - రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్‌లో - ప్రిన్‌స్పాల్ మెట్ కాఫ్ గారి వద్ద చదువుకున్నారు. 1891 సుమారులో ఇద్దరూ ఫస్ట్‌గ్రేడ్ ప్లీడర్ పరీక్షకు చదివి, గంజాం, గోదావరి జిల్లా కోర్టులలో ప్రాక్టీసు చేశారు. 1927-29 లో ఇద్దరూ మాన్యులైన పండిత మోతీలాల్ నెహ్రూగారి నాయకత్వాన మన దేశంలో నాటి పెద్దలంతా ఉన్న స్వరాజ్య పార్టీ పక్షాన కేంద్ర శాసన సభకు ఎన్నిక అయ్యారు. 1937 --39లలో ఇద్దరూ మద్రాసు శాసన సభా కాంగ్రేసు పక్షంలో ప్రకాశం గారు శాసన సభలోను, మా నాయనగారు శాసన మండలిలోను --సభ్యులుగా ఉండేవారు. ఈ సమయంలోనే నేను అనేక పర్యాయాలు ఆ మహా మానవుణ్ణి దర్శించగలిగాను. జీవితం పొడుగునా నేను ప్రకాశంగారిని మాననీయులైన మా తండ్రిగారితో సమానులుగానే చూసుకున్నాను. ఆయన విజ్ఞానము, ఆయన జీవితానుభవము నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాయనీ, పదేళ్ళ పసితనం నించీ నేను ఆయనను మన మహా నాయకులలో ఒకరుగా భావిస్తూ, ప్రజా సేవారంగంలో ఆయన కార్యక్రమాలను అమితాసక్తితో గమనిస్తూ ఎంతో లాభం పొందానని చెప్పుకుంటున్నాను.

ప్రకాశంగారు రాజకీయాలలో ప్రవేశించక పూర్వం గొప్ప సంఘ సంస్కరణవాది. మన సంఘంలోని మూఢాచారాలను, కుల, వర్గ, వర్ణ విభేదాలను రూపు మాపడంలో ఆయన ఎంతో శ్రద్ధ చూపేవారు. పందొమ్మిదవ శతాబ్దిలో భారతదేశంలో అవతరించిన మహా పురుషులలో ఆయన ఒకరు. అమృతసర్‌లో దారుణ హత్యాకాండ జరిగిన తరువాత