పుట:Naajeevitayatrat021599mbp.pdf/795

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్గం పేరుపోయి, వారికి వ్యతిరేకంగా ఎవరేమి వ్రాసినా చదవడానికి వందలకొద్ది పాఠకులు ఉండేవారు.

అప్పారావుగారు చాలా పెద్ద వ్యవహారజ్ఞులే అయినా, ఆ పత్రికను విస్తృతపరిచే ఊహ ఆయనకు లేకపోయింది. ఆ కారణంచేత ఆ పత్రికకూడా అచిరకాలంలోనే ఆగిపోవడం జరిగింది.

ఉత్పత్తి కొనుగోలుదారుల సహకార సంఘములు

ప్రకాశంగారి అభిప్రాయ ప్రకారంగా ఈ సంఘాలను సాగనిచ్చి ఉంటే, మన సంఘ వ్యవస్థలో అహింసా మార్గంలో మన ప్రజా సామాన్యం మధ్యవర్తులనుంచి విముక్తి పొంది ఉండేది. అయితే, మధ్యవర్తుల ప్రాబల్యానికి లోబడినవారు ప్రకాశంగారి మంత్రివర్గాన్ని పడగొట్టారని యిదివరలో పేర్కొన్నాను.

ఈ సంఘాలు సరిగ్గా పనిచేయడం లేదని ప్రకాశంగారి తర్వాత వచ్చిన మంత్రుల నోట అనిపిద్దామని - వీటిని గురించి, వీటి పని విషయం గురించి ఒక సభ్యుడు ప్రశ్నించారు. అప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించిన మంత్రి డాక్టర్ టి.ఎస్. రాజన్‌గారు. అప్పటికే ఈ సంఘాలు వ్యాపించకుండా అప్పటి మంత్రివర్గం కొన్ని ఆజ్ఞలు వేసిఉన్నది.

కాని, ప్రశ్న మలబారుకు సంబంధించింది గనుక, వారు అక్కడి సంఘాల యథాతథమైన పరిస్థితిని వివరించక తప్పలేదు. మలబారులో ప్రారంభించిన 107 సంఘాలలో ఏడు సంఘాలలో మాత్రం చిల్లర తప్పులు జరిగాయని చెప్పారు. తొమ్మండుగురు ఉద్యోగులపైన దోషారోపణ జరిగినా, అవి కోర్టులో నిలవలేదు.

అప్పుడు, అనుబంధ ప్రశ్నగా ఒక శాసన సభ్యుడు అడిగారు: "ఈ సంఘాలు ముఖ్యంగా మలబారులో బాగా పనిచేస్తున్నాయని, లోగడ ప్రభుత్వం వా రన్నమాట సరిఅయినదేనా?"

దానిపై రాజన్‌గారు ఇలా జవాబిచ్చారు:

"అధ్యక్షా! సరిగ్గా ఆలాగుననే నేను జవాబు ఇచ్చి ఉన్నాను. మలబారు జిల్లాలో మొత్తంపైన ఈ సంఘాలు