పుట:Naajeevitayatrat021599mbp.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాతం మరింత హెచ్చయింది, కాని, నాకు మాత్రం ఆయన వ్యతిరేకి అయ్యాడు. దాంతో నాకు స్థానికంగా కొంత సివిల్ ప్రాక్టీసు తగ్గింది. కాని, క్రిమినల్ వ్యవహారం బాగానే నడిచింది. నా ప్రాక్టీసు రాజమహేంద్రవరంలోనే కాకుండా జిల్లాలోనూ, పక్క నున్న ఏలూరు వగైరా పట్టణాల్లోనూ కూడా బాగానే వుండేది. డబ్బు కూడా దానికి తగినట్టుగానే వస్తూ వుండేది. ప్లీడర్లు, సంపాదనలో తన విలువ తానే నిర్ణయించుకోవాలి. నేను నా విలువ చాలా హెచ్చుగానే వుంచానని చెప్పాలనుకుంటాను. నా తోటి ప్లీడర్లు అందులోనూ బి.ఏ., బి.ఎల్.లు కూడా 25 రూపాయలు పుచ్చుకునే కేసులో నేను నిర్మొహమాటంగా వందరూపాయలు పుచ్చుకునేవాణ్ణి. ఒక కేసులో పోలవరం, జంగారెడ్డిగూడెం మొదలైన చోట్లకి వెళ్ళినందుకు పల్లకీ వగైరా ఖర్చులు గాక, రోజకి నూరురూపాయలు పుచ్చుగున్నాను. డబ్బనేది పోయేటప్పుడు ఎల్లాగ చేతులూ, కాళ్ళూ వచ్చిపోతుందో వచ్చేప్పుడు కూడా అలాగే వస్తుంది.

నాకు డబ్బు వస్తున్నట్టుగానే, సంసారం ఖర్చు కూడా చాలా దుబారాగానే అయింది. ఒంగోలులో వుండే కుటుంబం అంతా బంధువులతో సహా రాజమహేంద్రవరం చేరారు. హనుమంతరావు నాయుడుగారి కుటుంబభారం కూడా కొంతవరకు భరించడంలో నేను నా విధి కొంచెం మాత్రమే నిర్వర్తించగలిగాను. డబ్బు కనపడ్డప్పటినుంచీ ఖర్చు కూడా ఎక్కువైంది. మొట్టమొదట కొన్ని రోజులదాకా కోర్టుకు వెళ్ళడానికి ఒంటెద్దుబండి పెట్టాను. స్వయంగా ఆ బండికి రంగులు వేయించి ఒక ప్రత్యేకత ఏర్పడేటట్లు చేశాను. తరవాత కొంతకాలానికి ఒక డాకార్టూ, చక్కని పోనీ కొన్నాను. ఆ తర్వాత గుఱ్ఱాల్ని కొనడం, వాటిని పెంచడం కొంతకాలం అయింది. అప్పటికి డాకార్టు పెద్ద ప్లీడర్లైన నేతి సోమయాజులుగారికి ఒక్కరికే వుండేది. అప్పట్లో ఆయనతోబాటు నాకు కూడా డాకార్టు వుండాలని సరదాగా వుండేది.

మొదట్లో-అనగా ప్రాక్టీసు ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే