పుట:Naajeevitayatrat021599mbp.pdf/788

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉండాలి. రాష్ట్రానికి కావలసినటువంటి అన్ని హంగులు, రాష్ట్రంలో చేరవలసిన భూభాగం సరిహద్దులు సిద్ధంగా ఉంటేనే సంవిధానం షెడ్యూలు (అనుసూచి) లో రాష్ట్రంపేరు ఉంటే లాభముంటుందని వారు చెప్పారు.

సంవిధాన సభలో ఈ విషయం వచ్చినప్పుడు ప్రకాశంగారు ఇలా అన్నారు.

"అధ్యక్షా! ఈ సందర్భంలో ఒక విషయం మీ దృష్టికి తెస్తున్నాను. ఇప్పటికి 36 సంవత్సరాలుగా, ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రతినిధులుగా వచ్చిన డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు, ఆచార్య రంగాగారు, నేను మొదలైనవారము ఆంధ్ర రాష్ట్రం కావాలని వాదిస్తూనే ఉన్నాము. ఇప్పటివరకు మా కోరిక ఫలించలేదు.

"అయితే, ఈ రోజున మా సూత్రాన్ని కాంగ్రెసు వర్కింగ్ కమిటీవారు ఆమోదించారు. జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయి పటేలు, పట్టాభి సీతారామయ్యగారలకు ఈ సూత్రాన్ని అంగీకరించినందుకు నా కృతజ్ఞత. దీని విషయమైన పని ఈ రోజునే ప్రారంభం కావాలి. చెన్నపట్నం సంబంధించి తగాదా వచ్చింది. అది పరిష్కరించలేకపోయాము.

"అధ్యక్షా! మీరు థార్ కమిషనును నియమించారు. వారు దేశమంతా తిరిగారు. సమస్య బాగా పరిశీలించారు. కొన్ని సిఫారసులు చేశారు. వారు చేసిన సిఫారసులు ఆధారంగా చెన్నపట్నం - ఆంధ్రరాష్ట్రానికి కలపాలి అన్న వాదము, లేక పట్నం రెండుగా చేసి, రెండు రాష్ట్రాలకు చెరొక భాగం ఇవ్వాలనే వాదము; లేక చెన్నపట్నాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న వాదము అటుంచి, ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుచేయాలని కోరాము. వర్కింగ్ కమిటీవారు ఈ సమస్య విషయమై ఏ పరిష్కారానికీ రాలేకపోయారు. కాని, సరిహద్దు కమిషను వారు ఈ విషయంకూడా ఆలోచించే అవకాశ ముండగలదని