పుట:Naajeevitayatrat021599mbp.pdf/782

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విధంగా ఒక పది ఛార్జీలు కలిపి, మంత్రులు ఈ విధంగా అధికార దుర్వినియోగంచేస్తే, కాంగ్రెసు ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని కాంగ్రెసు అధ్యక్షులు రాజేంద్ర ప్రసాదుగారు చెన్నపట్నం వచ్చినప్పుడు విజ్ఞప్తి పత్రం ఆయన చేతికిచ్చాము.

అ సమయంలో ఆయన నాతో ఇలా అన్నారు: "నీవు సంతకంపెట్టి ఇచ్చినప్పుడు, ఇందులో నిజమున్నదో లేదో అన్న చర్చ నాకు అక్కరలేదు. నీవు వ్రాసింది నిజమని నేను నమ్ముతాను. కాని, ఏ డెనిమిదిమంది మంత్రులతో సంబంధించిన దీన్ని చర్చిస్తే ప్రభుత్వపు ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది. అందుచేత దీన్ని చర్చించాలని గట్టిగా అడగవద్దు."

"మీరూ మేమూ కలిసి పెంచిన కాంగ్రెసు ప్రతిష్ఠ మాట ఏమిటి?" అని నేను ఎదురు ప్రశ్న వేశాను.

ఆయన నవ్వుకుంటూ ఆ కాగితాలు ప్రక్కను పెట్టేసుకున్నారు. కాంగ్రెసు అధిష్ఠాన వర్గంవారు కలుగజేసుకోరని తెలిసిపోయింది.

అందుచేత ప్రకాశంగారే, ఈ విషయాలను శాసన సభలో చర్చించడానికై, శాసన సభ హక్కుల భంగమనే సూత్రం క్రింద ప్రివిలేజీ తీర్మాన మొకటి ప్రవేశపెట్టారు.

మంత్రులు అధికారం దుర్వినియోగం చేస్తే, దాన్ని, శాసన సభ హక్కులకు భంగం క్రింద చర్చించే అవకాశముందా, లేదా? అన్నది స్పీకరు పదిహేను రోజులపాటు ఆలోచించి, చివరకు దానికి హక్కుల భంగంతో సంబంధం లేదని త్రోసివేశాడు. అయితే, ఆ విధంగా త్రోసివేసినపుడు, ప్రత్యేకమైన తీర్మానం క్రింద నోటీసు ఇచ్చినట్టయితే ఆలోచిస్తానని ఒక వాక్యం అందులో వ్రాశాడు.

ప్రకాశంగారు ఆ సలహా తీసుకొని, ఆ దోషారోపణ పత్రంలోని విషయాలన్నీ శాసన సభవారు చర్చించి, దోషులయిన మంత్రుల మీద తగిన చర్య తీసుకొనేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేయవలసిందనే తీర్మానమును ప్రవేశ పెట్టారు. ప్రవేశ పెట్టేముందు, అనవసరమైన అభ్యంతరాలు ఆఫీసువారు లేవదీయకుండా, ఆ ముసాయిదా పత్రాన్ని