పుట:Naajeevitayatrat021599mbp.pdf/781

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రైతుల కీయవలసిన ఎరువులను తాను బ్లాక్ మార్కెట్ చేసుకున్నట్టయితే, ఉత్త పుణ్యానికే అనేక వేల రూపాయల లాభం పొందగలడు.

అధికార దుర్వినియోగ దోషారోపణలలో ప్రకాశంగారు పేర్కొనవాటిలో ఇది ఒకటి.[1]

  1. ఆ హోటలు ఖామందు, కూర్మయ్యగారు ఇప్పించిన గవర్నమెంట్ ఆర్డరు కాపీ తీసుకువెళ్ళి, వెంటనే ఎరువు లిమ్మని విజయవాడ అగ్రికల్చరల్ ఆఫీసరు నెత్తిపైన కూచున్నాడు. ఆయనేమో - గవర్నమెంట్ ఆర్డరు కాపీ తనకు అంది, ప్రభుత్వనుంచి వచ్చే ఆదేశాలు మొదలైనవి నమోదుచేసే రిజిస్టర్లో ఎక్కించు కోకుండా ఎరువు లివ్వలేనన్నాడు. చెన్నపట్నంనుంచి ఆర్డరు అధికార మార్గంలో విజయవాడకు అందలేదు. ఇంతలో ఈ వ్యవహారం చెన్నపట్నంలో పొక్కగా, వ్యతిరేక వర్గంవారు ముఖ్యమంత్రి రామస్వామి రెడ్డిగారి దగ్గరకు వెళ్ళి ఒక విజ్ఞప్తిపత్రం దాఖలు చేసుకొన్నారు. రైతుకాని ఒక హోటలు కీపరుకు మంత్రి కూర్మయ్యగారితో సన్నిహితత్వ మున్నదన్న కారణంతో అలా చేయరాదనీ, వ్యవసాయశాఖ మంత్రి వందలకొద్ది రైతులకు సరిపడే ఎరువులు ఒక నల్లబజారు ఆసామీకి ఇవ్వడం ఆపవలసిందనీ వారు విజ్ఞప్తిలో పేర్కొన్నారు. వెంటనే ముఖ్యమంత్రిగారు, ఆ ఆసామీకి ఎరువులు ఇవ్వడం ఆపమని ఆఫీసరుకు 'స్టాప్ ఇష్యూ' అని తంతి యిచ్చారు. ఇవ్వమని పంపిన నకలు ఆదేశం అందిన మూడు రోజులకు గానీ ముఖ్యమంత్రిగారి నిషేధ ఉత్తరువు అందలేదు. కూర్మయ్యగారి మిత్రులు తల పెట్టిన అన్యాయం జరగలేదని ఉద్యోగి సంతోషించినా, ముఖ్యమంత్రిగారి ఉత్తరువు అందే మధ్య గవర్నమెంట్ ఉత్తరువు ధిక్కరించాడనే ఆరోపణతో కూర్మయ్య, మాధవ మేనోన్ గారలు అతనిని డిస్మిస్ చేశారు. గవర్నమెంట్ ఆర్డరు అందక ఇవ్వలేదన్న అతని మొర విన్నవారు లేరు. 1954 లో ప్రకాశంగారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయి, అతని మెమోలు (అప్పీలు విజ్ఞప్తులు), చూచి, తిరిగీ ఉద్యోగంలోకి తీసుకున్నారు.