పుట:Naajeevitayatrat021599mbp.pdf/773

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవాడలో నేతాజీ సుభాస్ చంద్రబోసు కాంస్య విగ్రహాన్ని ప్రకాశంగారు ఆవిష్కరించారు. ప్రేక్షకులు చాలా మంది హాజరయ్యారు.

అంతక్రితం కాకినాడలో - ప్రకాశంగారి మంత్రివర్గ పతన కారకులలో ఒకరయిన పళ్ళంరాజు అనే ఆయనను బహిరంగ సభలో, అక్కడ చేరిన ప్రేక్షకులంతా అల్లరి చేశారు. ఆ వార్త విజయవాడలో 13 వ తేదీన తెలుసుకొన్న కొందరు, కాకినాడలో జరిగినదానికి ప్రతీకారంగా ప్రకాశంగారి ఉపన్యాస సమయంలో అల్లరి చేద్దామని యత్నించారట. ప్రకాశంగారి సభకు ఎవరూ వెళ్ళరాదని ఊళ్ళో ప్రచారం చేశారట.

సమావేశం ప్రారంభమయింది. వేదికమీద కదలకుండా కూచుని ప్రకాశంగారు ఇలా చెప్పారట:

"ఎవరికైతే ఎదురు పక్షంవారు వచ్చి కొడతారనే భయం ఉన్నదో వారు ఈ సభలోంచి వెళ్ళిపోవలసింది."

ఆ విధంగా ఆయన చెప్పినా, అక్కడ చేరిన డెబ్భై ఎనభై వేల మందిలో ఒక్కరూ కదలలేదట. అంతేకాకుండా, అల్లరి చేద్దా