పుట:Naajeevitayatrat021599mbp.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుండేవాడు. వెంకటేశ్వరరావుగారి ప్రాపంకం వల్ల నూజివీడు జమీందార్లకి ప్లీడరీ చేస్తూండేవాడు. ఆయనకి ఫీజురూపాయలు ఏనుగుల మీద వేసుకుని తీసుకువచ్చి ఇచ్చేవారు. ఆనాటి వృత్తి స్థితి అది.

7

నా వృత్తి

ప్లీడరీ ప్రారంభించినప్పటినుంచీ నాకు ఫైలు బాగానే వుండేదని చెప్పాలి. ఆరుమాసాల్లో పెద్ద ప్లీడర్లకి కూడా తీసిపోని ఫైలు ఉండేది. నన్నంతవరకూ వెంటాడించిన లేమి క్రమంగా వెనకపట్టింది. ఏ వృత్తిలోనైనా పేరు రావాలంటే ముందుపట్టిన కేసుల్లో మంచిపేరు సంపాదించాలి. నేను ప్రాక్టీసుకి వచ్చిన కొద్ది రోజులకే మంచిపేరు పడింది. ఆ రోజుల్లో క్రిమినల్ కేసుల్లో మేజిస్ట్రీటుల ధాటీలకి నిలబడే ప్లీడర్లకి ఫైలు బాగానే వుండేది. కేసుల్లో బలంలేదని ఇతర ప్లీడర్లు వదులుకున్న కేసులు కొన్ని నా పరం అవుతూ వుండేవి.

ఒకప్పుడు ఇద్దరు కుర్రవాళ్ళ మీద రైల్వే పార్సెల్ లోనించి వెండి పాళీలు తస్కరించారని కేసు వచ్చింది. పోలీసులు సారంగధరుడి మెట్ట దగ్గిర దాచిపెట్టిన వెండిపాళీలు చూపించారు. అందులో ఒకకుర్రవాడి తండ్రి నా దగ్గిర నౌఖరీ చేస్తూ వుండేవాడు. నేను ఆ కేసు పట్టి, చోరీ ఆస్తి చూపించినంత మాత్రాన నేరం రుజువు కాదని వాదించాను. మేజిస్ట్రేటు కేసు సెషన్సుకి పంపించాడు. సెషన్సు జడ్జీ ముందే ఒక అభిప్రాయానికి వచ్చాడు. అందులోనూ ఒక ముద్దాయి నేరం ఒప్పుకున్నాడు. దాంతో నేరం ఒప్పుగున్న ముద్దాయికి ఒక సంవత్సరం శిక్షా, ఒప్పుకోనివాడికి ఐదేళ్ళ శిక్షా విధించారు. నేను పట్టు