పుట:Naajeevitayatrat021599mbp.pdf/768

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లయిన తర్వాత అధిష్ఠానవర్గం ఎదుట, 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమానికి వ్యతిరేకంగా వీరు వ్రాసిన ఉత్తరం ప్రసక్తీ, వీరి ప్రసక్తీ వచ్చినవి. ఇటువంటి విషయం, మరే రాష్ట్రంలోను జరగలేదు. ఆ సందర్భంగా కొందరిపైన క్రమశిక్షణ చర్య తీసుకోబడింది. దీని మూలంగా రాష్ట్రంలో, ఒక భాషాప్రాంతంవారికీ, ఇంకొక భాషాప్రాంతంవారికీ మనస్పర్థలు పెరిగినవి. ఆ విధంగా మన రాష్ట్రంలో వారి వర్గం, వీరి వర్గం అంటూ ఏర్పడినవి.

"నేను నాయకుణ్ణిగా ఎన్నికైన తర్వాత, ఏయే వర్గాలు అప్పటికి ఉన్నవో, వాటిని పరిశీలించుకున్నాను. ప్రతి వర్గం నాయకుణ్ణీ మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి నాకు సహాయం చేయవలసిందని కోరాను....

(ఒక గౌరవ సభ్యుని చూపుతూ - )

"ఆ గౌరవ సభ్యునితో నేను చాలాసేపు ఆ విషయం చర్చించాను. వారూ, వారి వర్గమూ మంత్రివర్గంలో భాగస్వాములు కావడానికి ఒక నిర్ణయానికి రాలేదనీ, అందుచేత వారి వర్గంవారు అప్పటికి మంత్రివర్గంలో చేరదలచుకోలేదనీ చెప్పినారు. ఇతర వర్గాల నాయకుల సలహా తీసుకొనే ముందు నేను వీరితో మాట్లాడి ఉన్నాను. తర్వాత రెండవ వర్గంవారితో మాట్లాడాను. నా కోరికపైన వారు ఇచ్చిన పేర్లలో ఒకటి తప్ప తక్కువవాటిని నేను అంగీకరించాను...

"ఆ రోజున నా బాధలు ఆరంభమయినాయి. ఆ పేరు అంగీకరించకపోవడానికి అప్పటికి నా కొక కారణముండేది. అయితే, అప్పుడున్న కారణం ఎప్పటికీ ఉంటుందని అనుకోకూడదు...

"నేను మంత్రివర్గంలో చేర్చుకున్న మంత్రులు నాతో ఏకీభవిస్తారని, నన్ను ఏ ముఖ్యవిషయంలోనూ దిగవిడవరనీ, ప్రజాహిత కార్యక్రమాలలో తప్పక నాతోనే ఉంటారనే గట్టి