పుట:Naajeevitayatrat021599mbp.pdf/767

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరంలో గాంధీగారు తనతో హృదయపూర్వకంగా అన్ని సంగతులూ మాట్లాడారనీ, అయితే, తనకు మాత్రం ఏ స్థానమూ చూపించలేదనీ కూడా అందులో వ్రాశారు....

"తరువాత, నాయకుని ఎన్నికలో ప్రతి క్షణమూ అధిష్ఠానవర్గంవారు అతిగా జోక్యం కల్పించుకొంటూ వచ్చారు. అయినప్పటికీ, ఇప్పుడు ఎన్నికయిన రామస్వామిరెడ్డిగారిని ఆహ్వానించినట్టే అప్పట్లో నన్నూ మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి గవర్నరు ఆహ్వానించడం జరిగింది...

"మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి ముందు ఒక విషయం నా మనస్సును వేధించింది. ఏ రాష్ట్రంలోనూ లేని ఒక గట్టి ఇబ్బంది మనలను ఈ రాష్ట్రంలో బాధించింది. మనకు ఒక్కొక్కప్పుడు జ్ఞాపకశక్తి మందగిస్తుంది. అందుచేత, ఒక విషయం జ్ఞాపకం చేస్తాను.

"1942 లో, క్విట్ ఇండియా తీర్మానం ఆమోదింపబడడానికి పూర్వం మన రాష్ట్రంనుంచి నలుగు రైదుగురు పెద్ద మనుష్యులు, ఆ తీర్మానానికి తమ ప్రతికూలతను ప్రకటించి, నాయకునికి (గాంధీజీకి) ఒక హెచ్చరికవాక్యం వ్రాశారు.

"ఈ సాహసోద్యమం మీరు తల పెట్టకండి! ఇది చాలా కష్టాలను సృష్టిస్తుంది. మీరు ఈ పని చేయవద్దు అని....

"కానీ, ఆ నాయకులు ఈ ఉత్తరంలో వ్రాసినదాంతో ఏకీభవించక, అ పెద్ద మనుష్యులు తమ దగ్గిరికి వచ్చి తా మన్న మాటలను సమర్థించుకొనవలసిందని వ్రాశారు.

"అధ్యక్షా! ఆ క్షణంనుంచి, ఈ ప్రతికూలమైన ఉత్తరం వ్రాసినవారు - ఒక ప్రత్యేక ప్రతికూల దృష్టితో నడచుకొని వస్తున్నారు. కాంగ్రెసు సంస్థకు కారాగృహ ప్రాప్తి కలిగింది. కాని, ఈ పెద్దమనుష్యులు దానితో సంబంధం లేనివారుగా దూరంగా ఉండిపోయారు.

"కాంగ్రెసు నాయకులు (గాంధీ) కారాగృహ విముక్తు