పుట:Naajeevitayatrat021599mbp.pdf/765

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేదు. అటువంటి ప్రధానిని ప్రజా వ్యతిరేక శక్తులు పదవీచ్యుతుని చేయగా, ఆయన చెప్పదలచిన మాటలను, భవిష్యత్తును సముద్ధరించు కొనడానికి శ్రద్దగా వినవలసిన సత్సమయమది.

మంద్రమైన కంఠంతో, మాటకు మాటకు మధ్య కొంత విలంబనంతో, ప్రకాశంగారు మాట్లాడ నారంభించారు:

"అధ్యక్షా! ఈ నాయకత్వ మన్నది మాలో ఎవరో ఒకరు ప్రధాని కావడానికీ, మంత్రి మండలిని ఏర్పరచి పరిపాలన జరపడానికీ అధికారాన్నిస్తుంది. మన రాష్ట్రంలోనేగాక, ప్రపంచంలో అన్ని దేశాలలోను ఈ నాయకత్వానికి, పదవికి ఆశించడం కలదు.......

"ఈ రోజున నేను అసలు ఉపన్యాసమే చేయకుండా ఉంటే బాగుంటుం దనుకొన్నాను. కాని, శాసన సభలో కొన్ని విషయాలు తెలుసుకొనేందుకు కూతూహలత కన్పించింది. ఇంతేకాక, నేను ఏ పరిస్థితులలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశానో, ఏ పరిస్థితులలో మా మంత్రి పదవులను వదలుకో వలసి వచ్చిందో కొంచెం చెబుదామని నాకూ కోరిక ఉదయించింది........

"నేను కొన్ని విషయాలు సభ్యులకు చెప్పినట్ల యితే సరిపోతుంది. రాజకీయ ఖైదీలుగా మేము కారాగృహంలో ఉన్న సమయంలోనే, అక్కడినుంచి విముక్తులయిన తరువాత, ఈ శాసన సభకు నాయకులు వారా వీరా అనే పోటీలు బయలు దేరాయి... ....

"ఒక్కమారు మేము తిరుచినాపల్లి కారాగృహంలో ఉండగా, మాలో ఒకరికి పై నుంచి ఎవరో వ్రాసిన ఉత్తరంలో - ఆంధ్ర దేశంలో నాయకత్వం మారవలెనన్న ప్రసక్తి ఉండెను.....

"జనరల్ ఎన్నికలయిన తర్వాత, నాయకత్వానికి పోటీ చేసే పేర్లు ఒక్కొక్కటే మెల్లి మెల్లిగా బయటపడ్డాయి. నాయకత్వ పదవికి ముగ్గురు పోటీ చేస్తున్నట్టు మూడు పేర్లు కూడా